Strain Virus: భారత్‌ – నేపాల్‌ మధ్య రాకపోకలు కఠినతరం.. కరోనా నెగిటివ్‌ రిపోర్టుతో వస్తేనే అనుమతి

|

Jan 05, 2021 | 2:31 AM

 Strain Virus Effect: కొత్తరకం కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో మరింత ఆందోలళన వ్యక్తం అవుతోంది. యూకేలో మొదలైన ఈ స్ట్రెయిన్‌ విజృంభిస్తుండటంతో భారత్‌....

Strain Virus: భారత్‌ - నేపాల్‌ మధ్య రాకపోకలు కఠినతరం.. కరోనా నెగిటివ్‌ రిపోర్టుతో వస్తేనే అనుమతి
Follow us on

Strain Virus Effect: కొత్తరకం కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో మరింత ఆందోలళన వ్యక్తం అవుతోంది. యూకేలో మొదలైన ఈ స్ట్రెయిన్‌ విజృంభిస్తుండటంతో భారత్‌ ముందస్తుగా అప్రమత్తమైంది. భారత్‌ -నేపాల్‌ మధ్య కాళీ నదిపై ఉన్న ఐదు వంతెనల ద్వారా రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వారికే వంతెన ద్వారా ప్రవేశించేందుకు అనుమతి ఇస్తున్నారు. కరోనా నెగిటివ్‌ రిపోర్టులో వచ్చిన నేపాలీ ప్రజలనే భారత భూభాగంలోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. భారత్‌ నుంచి నేపాల్‌కు వెళ్లాలనుకునేవారికీ ఇదే నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. భారత్‌ -నేపాల్‌ దేశాల మధ్య రాకపోకలకు సంబంధించిన నిబంధనలు జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి.

అయితే బ్రిటన్‌తో పాటు భారత్‌లోనూ స్టెయిన్‌ కేసులు నమోదవుతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నామని పిథోర్‌గఢ్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ జోగ్‌దండే వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఎవరైనా నేపాల్‌ పౌరులు భారత్‌లోకి రావాలంటే క్రాసింగ్‌ వంతెనపై కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో నెగిటివ్‌ తేలితేనే సరిహద్దులు దాటే అవకాశం ఉంటుంది. పిథోర్‌గఢ్‌ జిల్లా పరిధిలో భారత్‌ -నేపాల్‌ మధ్‌య ఉన్న 5 వంతెన మార్గాల్లోనూ ఇవే నిబంధనలు వర్తించనున్నాయి.

కాగా, యూకేలో పుట్టిన ఈ స్ట్రెయిన్‌ వైరస్‌ మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తోంది. ముందే కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకోక ముందు మరో కరోనా కొత్త వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో భాతర్‌ ముందుగానే అప్రమత్తమై చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా యూకే నుంచి విమానాలపై సైతం నిషేధం విధించింది. విమానాల రాకపోకలు రద్దు చేసింది భారత్‌. ఇలాగే ఇతర దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.

Also Read: New  Strain Coronavirus :యూకే వైరస్‌లో మరో కొత్త స్ట్రెయిన్,, ఇండియాలో 38కి పెరిగిన కేసుల సంఖ్య, ప్రభుత్వం అప్రమత్తం