Sri Lanka Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక.. ప్రధాని ఇంటి దగ్గర హైటెన్షన్‌

|

Apr 08, 2022 | 4:19 AM

Sri Lanka Crisis: లంక రావణకాష్టంలా రగిలిపోతూనే ఉంది. ఎప్పుడు ? ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రధాని ఇంటి దగ్గర హై టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. బారికేడ్లను..

Sri Lanka Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక.. ప్రధాని ఇంటి దగ్గర హైటెన్షన్‌
Sri Lanka Crisis
Follow us on

Sri Lanka Crisis: లంక రావణకాష్టంలా రగిలిపోతూనే ఉంది. ఎప్పుడు ? ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రధాని ఇంటి దగ్గర హై టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. బారికేడ్లను సైతం తొలగించి, ప్రధాని ఇంటివైపు దూసుకెళ్లారు ఆందోళనకారులు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక (Sri Lanka)లో జనం రగిలిపోతున్నారు. ప్రధాని రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నారు. అటు రోజురోజుకు ఆందోళనా కార్యక్రమాలను ఉధృతం చేస్తున్నారు. ప్రధాని మహిందా రాజపక్సె ఇంటి వైపు దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం నెట్టుకుని ప్రధాని ఇంటి ((PM House) వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వారిని నెట్టి వేసి మూడంచెల భద్రతలో ఒక అంచె దాటుకుని ముందుకెళ్లారు. వేలాది మంది ఆందోళనకారులు ఒక్కసారిగా లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిలువరించలేకపోయారు. అయితే ఇప్పటికే ఒక అంచె దాటి ముందుకెళ్లిన ఆందోళనకారులపై టియర్‌గ్యాస్‌ ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. మూడంచెల భద్రతలో రెండో అంచె దాటితే టియర్‌ గ్యాస్ ప్రయోగిస్తారు. మూడో అంచె దాటితే కాల్పులకు దిగుతారు పోలీసులు.

పోలీసుల బెదిరింపులను లెక్క చేయని ఆందోళనకారులు:

పోలీసుల బెదిరింపులను ఏ మాత్రం లెక్క చేయడం లేదు ఆందోళనకారులు. అయితే ప్రధాని ఇంటి ముట్టడి సమయంలో జోరుగా వర్షం రావడంతో నిరసనలు కొద్దిసేపు ఆగిపోయాయి. అయితే ప్రధాని రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్న జనం, తమ పోరుబాటను ఆపేలా కనిపించడం లేదు. శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభానికి ఇప్పుడున్న ప్రధాని, అధ్యక్షుడే కారణమని భావిస్తున్న ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పూర్తిగా దిగజారిన దేశ ఆర్థిక పరిస్థితికి అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ఆయన సోదరుడు ప్రధాని మహీంద రాజపక్సే బాధ్యత వహించాలంటూ కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో ప్రతిపక్ష నేత సజిత్‌ ప్రేమదాస ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు రాజపక్స నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భారీగా ఆందోళనకారులు రావడంతో ఆర్మీ రంగంలోకి దిగింది.

శ్రీలంక జాతీయ పతాకాలను పట్టుకుని నినాదాలు..

ఆందోళనాకారులు శ్రీలంక జాతీయ పతాకాలను పట్టుకొని గొటా గో డౌన్‌ డౌన్‌.. గో బ్యాక్‌ నినాదాలు చేస్తూ లెవల్‌ 1 సెక్యూరిటీ లైన్‌ దూసుకొని ముందుకు వెళ్లిపోయారు.. ప్రస్తుత సంక్షోభానికి కారణమైన రాజపక్సే సోదరులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే భారీ వర్షం రావడంతో ఆందోళనకారుల నిరసనలకు కొద్దిసేపు బ్రేక్‌ పడింది. అంతకుముందు పోలీసులు మీడియాను అక్కడి నుంచి దూరంగా పంపారు. ఆందోళనకారులు మూడంచెలు దాటి ప్రధాని ఇంటి వైపు దూసుకెళితే కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యారు. దీంతో కొలంబోలో ఎప్పుడు ? ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు, ఆర్మీ అధికారులు కాల్పులు జరిపితే ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Russia Suspended: ఐక్యరాజ్యసమితిలో రష్యాకు ఎదురుదెబ్బ.. మానవ హక్కుల మండలిలో సభ్యత్వం రద్దు!

Pakistan Political Crisis: మళ్లీ ఓటింగ్‌ నిర్వహించాలి.. ఇమ్రాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..