బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా

సోమాలియా రాజధాని మొగదీష్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. అధ్యక్ష భవనం సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లలో 14 మంది చనిపోయారు. 26 మందికి తీవ్రగాయాలయ్యాయి. తొలుత అధ్యక్ష భవనం దగ్గర పేలుడు జరిగింది. తర్వాత ఫోర్ట్‌ఫీల్డ్ విమానాశ్రయం దగ్గర మరో పేలుడు సంభవించింది. బాంబు పేలుళ్లకు అల్‌ఖైదా ఉగ్రవాద అనుబంధ సంస్థ అల్‌షబాబ్ బాధ్యత వహించింది. అయితే అక్టోబర్‌లో కూడా జరిగిన బాంబు పేలుళ్లలో అల్‌షబాబ్ హస్తముందని దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో 500 మంది చనిపోయారు. […]

బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2019 | 9:58 AM

సోమాలియా రాజధాని మొగదీష్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. అధ్యక్ష భవనం సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లలో 14 మంది చనిపోయారు. 26 మందికి తీవ్రగాయాలయ్యాయి. తొలుత అధ్యక్ష భవనం దగ్గర పేలుడు జరిగింది. తర్వాత ఫోర్ట్‌ఫీల్డ్ విమానాశ్రయం దగ్గర మరో పేలుడు సంభవించింది. బాంబు పేలుళ్లకు అల్‌ఖైదా ఉగ్రవాద అనుబంధ సంస్థ అల్‌షబాబ్ బాధ్యత వహించింది. అయితే అక్టోబర్‌లో కూడా జరిగిన బాంబు పేలుళ్లలో అల్‌షబాబ్ హస్తముందని దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో 500 మంది చనిపోయారు. తాజా పేలుళ్లలో 14 మంది చనిపోవడం కలవరపెడుతోంది.