Viral: క్రిస్మస్ చెట్టు నుంచి వింత శబ్దాలు.. భయపడుతూనే ఏంటని చూడగా.. ఒక్కసారిగా.!

ప్రస్తుతం ప్రపంచమంతా క్రిస్మస్, న్యూఇయర్ సందడి నెలకొంది. అయితే ఓ వ్యక్తికి మాత్రం ఈ క్రిస్మస్ వేళ ఫ్యూజులు ఎగిరిపోయేలా షాక్ తగిలింది.

Viral: క్రిస్మస్ చెట్టు నుంచి వింత శబ్దాలు.. భయపడుతూనే ఏంటని చూడగా.. ఒక్కసారిగా.!
Christmas Tree

Updated on: Dec 30, 2022 | 1:19 PM

ప్రస్తుతం ప్రపంచమంతా క్రిస్మస్, న్యూఇయర్ సందడి నెలకొంది. అయితే ఓ వ్యక్తికి మాత్రం ఈ క్రిస్మస్ వేళ ఫ్యూజులు ఎగిరిపోయేలా షాక్ తగిలింది. అతడు తన ఇంటిలో క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసుకున్నాడు. అయితే ఈలోపు దాని నుంచి వింత శబ్దాలు రావడాన్ని గమనించాడు. ఏంటని దగ్గరకు వెళ్లి చూడగా.. దెబ్బకు షాక్.! ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. స్థానిక క్వీన్స్‌బర్గ్‌లో నివాసముంటున్న నిక్ ఎవాన్స్ అనే వ్యక్తి తన ఇంట్లో క్రిస్మస్‌ చెట్టును ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని ఎంచక్కా డెకరేట్ చేశాడు. అయితే ఈలోపు దాని నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. వాటిని అతడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అవి మాత్రం ఆగలేదు. అందుకే అందులో ఏముందా అని చూసేందుకు భయం.. భయంగానే ముందుకు వెళ్లాడు. అలా ట్రీ దగ్గరకు వెళ్ళాడో.. లేదో.. అతడ్ని భయభ్రాంతులకు గురి చేసేలా బ్లాక్ మాంబా స్నేక్ ఒకటి అందులో దాగి ఉంది. అది ఇతడిపై దాడి చేసేలోపే మనోడు అప్రమత్తమై.. దాన్ని చాకచక్యంగా పట్టుకున్నాడు. అనంతరం సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది.. ఆ పామును అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు.

కాగా, బ్లాక్ మాంబా స్నేక్‌లు ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతకమైన పాములలో ఒకటి. ఈ పాము విషం ఓ మనిషిని కేవలం 20 నిమిషాల్లోనే చంపేయగలదు. ఇవి మనుషులకు, ఇతర జంతువులకు ఎక్కువగా కనిపించవు. అయితే వీటిని వేటాడటానికి ప్రయత్నిస్తే మాత్రం కచ్చితంగా ఎదురు తిరుగుతాయి. దూకుడుగా ప్రవర్తిస్తాయి. ఈ జాతి పాములు ఎక్కువగా రాతి కొండలు, ఆఫ్రికాలోని బహిరంగ అటవీ ప్రాంతాల్లో తిరుగుతుంటాయి.