New York Floods: న్యూయార్క్‌ను ముంచెత్తిన వరదలు.. సోషల్ మీడియాలో షాకింగ్ వైరల్ వీడియోలు..

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కుండపోత వర్షాలు దంచిగొడుతున్నాయి. దీంతో న్యూయార్క్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు స్తంభించింది. సబ్‌వేలలోకి వరదనీరు చేయడంతో వాటిని మూసివేశారు. వరదలకు జనజీవనం స్తంభించగా.. ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. దీంతో నగరవాసులు తమ ఇళ్లకే పరిమితమయ్యారు.

New York Floods: న్యూయార్క్‌ను ముంచెత్తిన వరదలు.. సోషల్ మీడియాలో షాకింగ్ వైరల్ వీడియోలు..
New York Floods

Updated on: Sep 30, 2023 | 12:16 PM

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కుండపోత వర్షాలు దంచిగొడుతున్నాయి. దీంతో న్యూయార్క్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు స్తంభించింది. సబ్‌వేలలోకి వరదనీరు చేయడంతో వాటిని మూసివేశారు. వరదలకు జనజీవనం స్తంభించగా.. ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. దీంతో నగరవాసులు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. పలు అపార్ట్‌మెంట్, షాపింగ్ మాల్స్‌, స్కూల్స్‌లోని బేస్‌‌మెంట్లలో వరద నీరు చేరింది.  న్యూయార్క్ నగరంలోని ప్రధాన రోడ్లు మినీ జలాశయాలను తలపిస్తున్నాయి. భారీ సంఖ్యలో వాహనాలు వరదనీటిలో మునిగాయి.

జలాశయాలను తలపిస్తున్న న్యూయార్క్ నగర రోడ్లు..

న్యూయార్క్ నగర రోడ్లపై పొంగి ప్రవహిస్తున్న వరదనీరు..

రికార్డు స్థాయి వర్షాల నేపథ్యంలో లగువార్డియా ఎయిర్‌పోర్ట్‌ను వరదలు ముంచెత్తాయి. విమానాశ్రయంలో మోకాలి లోతు నీటిలో ప్రయాణీకులు నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దాదాపు 200 విమానాల రాకపోకలపై ప్రభావంపడింది. కొన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. విమానాశ్రయం టెర్మినల్ ఏలో ఆపరేషన్స్‌ను పూర్తిగా రద్దు చేసిన అధికారులు.. టెర్మినల్ సీ ద్వారా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

లగువార్డియా విమానాశ్రయంలో మోకాలిలోతు వరదనీరు..

వరదలు ముంచెత్తడంతో న్యూయార్క్‌‌లోని సెంట్రల్ జూ పార్క్ నుంచి సీ లయన్స్, ఇతర జంతువులు తప్పించుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో వైరల్ అయిన సీ లయన్ వీడియో..

అయితే జూ నుంచి వణ్య మృగాలు తప్పించుకున్నాయన్న కథనాలను జూ నిర్వాహకులు తోసిపుచ్చారు. అన్ని జంతువులు జూలో క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జూను మూసివేసినట్లు సెంట్రల్ పార్క్ జూ అధికారి ఓ ట్వీట్‌లో తెలిపారు. సెంట్రల్ జూ పార్క్‌లోని సముద్ర సింహాలు అన్ని క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. జూ నుంచి వణ్యప్రాణులు తప్పించుకున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టంచేశారు.

సెంట్రల్ పార్క్ అధికారి వివరణ..