Sri Lanka: పాఠశాలలు, ఆఫీసులు మూసివేత.. ఇంధన కొరతతో అల్లాడుతున్న శ్రీలంక

|

May 21, 2022 | 9:34 AM

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సింహళ దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఇప్పటికే ప్రజలపై అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఈ నిబంధనలపై అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు....

Sri Lanka: పాఠశాలలు, ఆఫీసులు మూసివేత.. ఇంధన కొరతతో అల్లాడుతున్న శ్రీలంక
Sri Lanka
Follow us on

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సింహళ దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఇప్పటికే ప్రజలపై అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఈ నిబంధనలపై అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. శ్రీలంక(Sri Lanka) లో పరిస్థితులు అదుపుతప్పేందుకు పాలకులే ప్రధాన కారణమంటూ ఆందోళనలు చేశారు. హింసాత్మకంగా మారిన ఈ నిరసనల్లో చాలా మంది మృతి చెందారు. ఈ పరిస్థితుల్లో ద్వీపదేశాన్ని ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెట్రోల్‌(Petrol Crisis) డబ్బాలతో బంకుల వద్ద ప్రజలు రోజులకొద్దీ పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంది. ఇంధన కొరత తీవ్రమైన నేపథ్యంలో చర్యలు చేపట్టిన శ్రీలంక అధికారులు తాజాగా అక్కడి పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు రావద్దని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ పాలనా విభాగం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలనూ శుక్రవారం మూసివేయాలని ఆదేశించింది. అయితే, ఇవి ఎప్పటివరకు కొనసాగుతాయనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.

పెట్రోల్‌తో పాటు ఇతర ఇంధనాల కొరత కూడా శ్రీలంకను తీవ్రంగా వేధిస్తోంది. దేశంలో ఒకరోజు మాత్రమే సరిపడా పెట్రోల్‌ నిల్వలు ఉన్నాయంటూ ఇటీవల నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రణిల్‌ విక్రమసింఘే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి రుణాలను ఎగ్గొట్టింది. ఆ దేశం చెల్లించాల్సిన 78 మిలియన్‌ డాలర్ల రుణానికి సంబంధించి గ్రేస్‌ పిరియడ్‌ కూడా ముగిసిపోవడంతో అధికారికంగా ఎగ్గొట్టినట్లైంది. ఈ విషయాన్ని రెండు క్రెడిట్‌ ఏజెన్సీలు ధ్రువీకరించాయి.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

China Pangong Lake: శృతిమించుతోన్న చైనా ఆగడాలు.. సీరియస్‌గా స్పందించిన భారత్..

Woman Stunt: విమానంలో మహిళ చేసిన పనికి అంతా షాక్‌.. వైరల్‌ అవుతున్న అమేజింగ్‌ వీడియో..