Viral Video: అక్కడ చక్కెర ప్యాకెట్ల కోసం కొట్లాట.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 27 రోజులు పూర్తయ్యాయి. ఉక్రెయిన్‌ (Ukraine)లోని అనేక ప్రధాన నగరాలపై రష్యా నిరంతరం బాంబు దాడులు, క్షిపణి దాడులు చేస్తోంది.

Viral Video: అక్కడ చక్కెర ప్యాకెట్ల కోసం కొట్లాట.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
Russia Ukraine Crisis

Updated on: Mar 23, 2022 | 6:45 AM

Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 27 రోజులు పూర్తయ్యాయి. ఉక్రెయిన్‌ (Ukraine)లోని అనేక ప్రధాన నగరాలపై రష్యా నిరంతరం బాంబు దాడులు, క్షిపణి దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు మృత్యువాత పడ్డారు. అలాగే ఉక్రెయిన్‌లోని చాలా నగరాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరోవైపు రష్యా (Russia) కు కూడా ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికాతో పాటు పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశంలో సంక్షోభం తలెల్తుతోంది. చాలా దేశాలు ర‌ష్యాకు దిగుమ‌తుల‌ను నిలిపివేయ‌డంతో నిత్యావసర సరుకుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు దేశంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు కూడా ఆకాశానంటుతున్నాయి. ఈక్రమంలో అక్కడి దీనపరిస్థితికి అద్దం పట్టేలా ఒక వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. ఈ వీడియోలో పంచదార (Sugar) ప్యాకెట్లను దక్కించుకునేందుకు రష్యన్లు పోటీపడుతున్నారు. ఒకరినొకరు తోసుకుంటున్నారు.

ఎగుమతులపై ఆంక్షలతో..

వివిధ దేశాల ఆంక్షల కారణంగా రష్యాలో ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది. 2015 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుంది. మరోపక్క అధికారులు మాత్రం చక్కెర కొరత లేదంటున్నారు. అయితే తయారీదారులు ధరలు పెంచుకునేందుకు నిల్వలు ఉంచడం, వినియోగదారులు ఆందోళనతో ఎక్కువగా కొనేయడంతో ఈ సంక్షోభం తలెత్తిందంటున్నారు. ఈ ప్రకటనలు ఇలా ఉండగానే.. చక్కెర ఎగుమతిపై రష్యా ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించడం గమనార్హం. ఈక్రమంలో ఒక వినియోగదారుడు 10 కేజీల చక్కెర మాత్రమే కొనుగోలు చేయాలంటూ కొన్ని దుకాణాలు పరిమితులు విధిస్తున్నాయి. దీంతో సూపర్‌మార్కెట్ల వద్ద తోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ సూప‌ర్ మార్కెట్‌లో చక్కెర ప్యాకెట్ల కోసం ర‌ష్యన్లు కొట్లాడుకున్నారు. ఒక‌రి దగ్గరి ఉన్న పంచదార ప్యాకెట్లను మ‌రొక‌రు లాక్కున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Also Read:Viral Video: అయ్యో అయ్యో అయ్యయ్యో.. బుడ్డోడికి ఎన్ని కష్టాలోచ్చాయో..! ఫన్నీ వీడియో వైరల్

Traffic Challan: ఖజానాకు కాసులు కురిపిస్తున్న ట్రాఫిక్‌ చలాన్లు.. 20 రోజుల్లో 1.2 కోట్ల చలాన్లు క్లియర్‌..

NEPA Jobs: పదో తరగతి అర్హతతో.. నార్త్‌ ఈస్టర్న్‌ పోలీస్‌ అకాడమీలో గ్రూప్‌ సీ ఉద్యోగాలు..!