Russia-Ukraine War Petrol Bombs: ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై దాడులను తీవ్రం చేస్తోంది రష్యన్ ఆర్మీ. కీవ్, ఖార్కీవ్ ప్రాంతాల్లో బాంబు దాడులను పెంచింది. ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, టీవీ టవర్, పోలీస్ బిల్డింగ్‌పై బాంబు దాడులు చేస్తున్నాయి రష్యా సేనలు. ఈ దాడులకు దీటుగా బదులిచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది ఉక్రెయిన్. కానీ రష్యా బలగాలను పూర్తిగా కట్టడి చేయలేకపోతున్నారు ఉక్రెయిన్ సైనికులు. దీంతో రంగంలోకి దిగారు అక్కడి పౌరులు. రష్యాను ప్రతిఘటించడానికి పెట్రో బాంబులను వాడాలని నిర్ణయించుకున్నారు ఉక్రెయిన్ ప్రజలు. ఈ పెట్రో బాంబుల ద్వారా రష్యాను ఎదుర్కొంటామని, కీవ్ ప్రాంతాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేస్తున్నారు పౌరులు. కీవ్ ప్రాంతానికి రక్షణగా తాము ఉంటామని, పెట్రో బాంబులతో రష్యాకు బదులిస్తామని అంటున్నారు ఉక్రెయిన్ సిటిజన్స్. తాము యుద్ధానికి ఏమాత్రం భయపడటం లేదని, తమ మాతృభూమి కోసం పోరుడుతున్నామని అంటున్నారు. తామేమీ రష్యాకు భయపడటం లేదని, మేము కూడా మంచి పోరాట యోధులమే అని స్పష్టం చేస్తున్నారు.
ఎలాంటి ఆయుధాలు లేకుండా రష్యా సేనలతో పోరాటం చేయగలం అని అంటున్నారు. ఇప్పటికే, రష్యా సైన్యాన్ని ఎదుర్కోవడానికి, అక్కడి పౌరులకు ఆయుధాలు ఇచ్చింది ఉక్రెయిన్ ప్రభుత్వం. అంతేకాకుండా, ఆ సైన్యానికి అండగా నిలుస్తున్నారు ఉక్రెయిన్ సెలబ్రెటీలు.
తాము యుద్ధంగా పాల్గొంటామని, దేశాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఈ పెట్రో బాంబులతో రష్యాకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు ఉక్రెయిన్ పౌరులు.
ఇవి కూడా చదవండి: తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారు ఉచితంగానే బస్సుల్లో ప్రయాణించవచ్చు
Russia-Ukraine War: రష్యా దాడుల బీభత్సం… కాలినడకన ఉక్రెయిన్ నుంచి ఎస్కేప్ అయిన స్టార్ హీరో!