Russia Ukraine War Live Updates: రష్యన్‌ మిస్సైల్స్‌ సృష్టిస్తోన్న విధ్వంసం.. పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్ కాల్

|

Mar 02, 2022 | 9:48 PM

Russia Ukraine Crisis Live Updates: రష్యా - ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. చర్చలు ఫలించకపోవడంతో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటైన రష్యా.. పొరుగు దేశం ఉక్రెయిన్‌పై

Russia Ukraine War Live Updates: రష్యన్‌ మిస్సైల్స్‌ సృష్టిస్తోన్న విధ్వంసం.. పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్ కాల్
Russia Ukraine War

Russia Ukraine Crisis Live Updates: రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. చర్చలు ఫలించకపోవడంతో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటైన రష్యా.. పొరుగు దేశం ఉక్రెయిన్‌పై తన దాడులను తీవ్రతరం చేసింది. మొదటి విడత చర్చలు ముగిసిన తర్వాత కీవ్ నగరంపై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దాడులు తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో.. ఉక్రెయిన్ నుంచి ప్రమాదం పొంచి ఉన్న దృష్యా రష్యా అధ్యక్షడు పుతిన్ సైతం తమ కుటుంబాన్ని ఐలాండ్‌కు తరలించి బంకర్‌‌కు తరలించారు. అయితే.. ఈ రోజు రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండోసారి చర్చలు జరగనున్నాయి. మొదటి విడత చర్చలు విఫలం అయిన నేపథ్యంలో రెండో దశ జరిగే చర్చలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ దేశాలన్నీ చర్చలు సఫలం కావాలంటూ కోరుతున్నాయి.

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ సంచలన ప్రతిజ్ఞ చేశారు. ప్రాణాలు పోయినా సరే రష్యాకు లొంగేది లేదని స్పష్టం చేశారు. రష్యాకు తగిన గుణపాఠం నేర్పిస్తామంటూ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్‌లో చేరతామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దరఖాస్తు చేసిన ఒకరోజులోనే “యూరోపియన్ యూనియన్” అత్యవసర పార్లమెంట్ సమావేశం నిర్వహించి సభ్యత్వం ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన జెలెన్‌స్కీ ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని కోరారు. రష్యా దాడుల్లో అమాయక పౌరులు, చిన్నారులు చనిపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈయూ సైతం రష్యా మీడియాపై నిషేధం విధించింది.

దీంతోపాటు ఈ యుధ్దంపై అంతర్జాతీయ న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. 7, 8 వ తేదీలల్లో విచారణ చేయనుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సైతం ప్రత్యేక సమావేశం నిర్వహించి యుద్ధాన్ని ఆపడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పేర్కొంది.

ఇదిలాఉంటే.. ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాను ఇరుకున పెట్టేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు మరిన్ని ఆంక్షలను విధిస్తున్నాయి. రష్యాకు చెందిన మరో 26 మందిపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించింది. వారిలో ఒలిగార్క్‌లు, సీనియర్ అధికారులు, పలు బీమా సంస్థలు ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకూ 680 మంది లక్ష్యంగా ఐరోపా సమాఖ్య ఆంక్షలను విధించింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Mar 2022 09:05 PM (IST)

    ఉక్రెయిన్‌పై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష

    ఉక్రెయిన్ సంక్షోభాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు వరుసగా నాలుగో రోజు కూడా ఆయన అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశమవుతోంది.

  • 02 Mar 2022 08:34 PM (IST)

    ఖార్కీవ్‌లో ఆసుపత్రిపై ఎటాక్‌

    ఖార్కీవ్‌లోని ఓ ఆసుపత్రిపై ఎటాక్‌ చేసింది రష్యా. రష్యా పారా మిలిటరీ దళాలతో ఉక్రెయిన్‌ ధీటుగా పోరాడుతోంది. జనావాసేలే లక్ష్యంగా మాస్కో సేనలు దాడులకు తెగబడుతున్నాయి.

  • 02 Mar 2022 07:06 PM (IST)

    రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్

    =రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేటికీ ఏడవ రోజు కొనసాగుతోంది. రష్యా సైన్యం కైవ్‌పై దాడి చేయడం ప్రారంభించింది. పారాట్రూపర్లు రంగంలోకి దిగిన ప్రతి క్షణం మాతో ఉండేందుకు, ఖార్కివ్‌ను పట్టుకునేందుకు రష్యా దళాలు తమ దాడిని తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. భారత విద్యార్థులను రష్యా మీదుగా తరలించాలని ప్రధాని మోడీ కోరారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పుతిన్‌ను అడిగినట్లు సమాచారం. దీంతో భారతీయ విద్యార్థులకు సేఫ్‌ ప్యాసేజ్‌ కల్పించింది రష్యా సైన్యం. ఈ నేపథ్యంలో ఖార్కివ్ నుంచి భారతీయులు వీడి వెళ్లేందుకు దాడులకు 6 గంటల విరామం ప్రకటించింది రష్యా సైన్యం

  • 02 Mar 2022 06:56 PM (IST)

    సెంట్రల్ ఖార్కివ్‌పై మరో క్షిపణి ప్రయోగం

    ఖార్కివ్‌లో రష్యా మరో భారీ దాడికి పాల్పడినట్లు పెద్ద వార్త బయటకు వస్తోంది. సెంట్రల్ ఖార్కివ్‌లో రష్యా సైన్యం క్షిపణులను ప్రయోగించింది. ఈ ఘటనలో పలు భవనాలు ధ్వంసమైనట్లు సమాచారం.

    Russia Ukraine War

  • 02 Mar 2022 06:15 PM (IST)

    కైవ్‌లోని పలు ప్రాంతాల్లో రష్యా దాడి

    ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోని పలు ప్రాంతాల్లో రష్యా దాడులు చేసింది. ఈ ఘటనలో పలు ప్రధాన కార్యాలయాలతో పాటు భారీ భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజా నివాస ప్రాంతాల్లోనూ దాడులు జరుగుతున్నాయి.

  • 02 Mar 2022 06:14 PM (IST)

    మారణాయుధాలతో కైవ్‌లో రష్యా సైన్యం కవాతు

    రష్యా సైన్యం మారణాయుధాలతో కైవ్‌లోకి దూసుకుపోతోంది. రష్యన్ కాన్వాయ్‌లో డజన్ల కొద్దీ సాయుధ వాహనాలు ఉన్నాయి. అదే సమయంలో, రష్యా కూడా ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది. గత ఏడు రోజులుగా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోందన్న సంగతి తెలిసిందే.

    Russia Army

  • 02 Mar 2022 06:09 PM (IST)

    బుచా, ఇర్పిన్‌లపై రష్యా వైమానిక దాడి

    ఉక్రెయిన్‌లోని బుచా, ఇర్పిన్ నగరాలపై రష్యా వైమానిక దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ రెండు నగరాలపై రష్యా సుఖోయ్-25 యుద్ధ విమానాలతో దాడి చేసింది.

  • 02 Mar 2022 06:07 PM (IST)

    పలు నగరాల్లో వైమానిక దాడుల హెచ్చరిక

    ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో వైమానిక దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నగరాల్లో కైవ్, ఖార్కివ్, చెర్కాసీ, సుమీ వంటి నగరాలు ఉన్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.

  • 02 Mar 2022 06:07 PM (IST)

    ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరంలో భారీ అగ్నిప్రమాదం

    ఖార్కివ్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. అదే సమయంలో ఇక్కడి వైద్య కేంద్రంపై రష్యా దాడి చేసింది. మరోవైపు ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి

     

  • 02 Mar 2022 06:05 PM (IST)

    యుద్ధంతో రష్యా ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది – క్రెమ్లిన్

    యుద్ధం ఏడో రోజున రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. రష్యా ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర దశకు చేరుకుందని క్రెమ్లిన్ పేర్కొంది. పుతిన్‌కు మద్దతివ్వడం రష్యా ప్రాధాన్యత అని ఆయన పిలుపునిచ్చారు.

  • 02 Mar 2022 06:02 PM (IST)

    మూడవ ప్రపంచ యుద్ధం వినాశకరమైనదిః రష్యా విదేశాంగ మంత్రి

    మూడో ప్రపంచ యుద్ధం జరిగితే అందులో అణ్వాయుధాలు కూడా ఉంటాయని, అది విధ్వంసకరమని రష్యా విదేశాంగ మంత్రి లావ్‌రోవ్ చెబుతున్నట్లు రష్యా మీడియా స్పుత్నిక్ పేర్కొంది.

  • 02 Mar 2022 05:56 PM (IST)

    ఉక్రెయిన్ ఇప్పట్లో కోలుకోలేదుః లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్

    ఉక్రెయిన్‌లో అసాధారణమైన పరిస్థితి నెలకొనడానికి చాలా కాలం పడుతుందని లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్ అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం ఒక అసాధారణ పరిస్థితి అని, ఇది చాలా కాలం పాటు కొనసాగుతుందని, అటువంటి పరిస్థితిలో చిక్కుకున్న సామాన్యులకు ఒక నాయకుడిని కలిగి ఉండటం చాలా ముఖ్యమని రక్షణ నిపుణులు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్ అన్నారు.

  • 02 Mar 2022 05:54 PM (IST)

    టర్కీ నుంచి ఉక్రెయిన్ కొత్త డ్రోన్‌లు

    యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు టర్కీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే టర్కీ నుంచి ఉక్రెయిన్ కొత్త డ్రోన్‌లను అందుకుంది. ఉక్రెయిన్‌కు మరిన్ని అటాక్ డ్రోన్‌లు వచ్చాయి.

  • 02 Mar 2022 05:51 PM (IST)

    భారతీయులు వెంటనే ఖార్కివ్‌ను విడిచిపెట్టాలి

    ఉక్రెయిన్‌లోని భారతీయులకు మరో ముఖ్య సూచకను భారత రాయబారి కార్యాలయం జారీ చేసింది. ఖార్కివ్‌లో నివసిస్తున్న భారతీయ పౌరుల వెంటనే నగరం విడిచి వెళ్లాలని సూచించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా నగర శివార్లలోని పెసోచిన్, బబాయే, బెజ్లిడోవ్కా వైపు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్లాలని అధికారులు ఆదేశించారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం గం. 6.00 వరకు చేరుకోవాలని పేర్కొన్నారు.

  • 02 Mar 2022 05:45 PM (IST)

    ఉక్రెయిన్‌లో అనుకూల ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో రష్యా

    రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఏడవ రోజు మరింత ఘోరంగా మారింది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా వరుస దాడులను ప్రారంభించింది. ఖార్కివ్‌లో రష్యా వైమానిక దాడిలో కనీసం 21 మంది మరణించారు. అయితే ఇప్పటికే రెండు దేశాల మధ్య బెలారస్ వేదిక చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌లో రష్యా అధ్యక్షుడి అసలు ఫ్లాన్ బయటపడుతోంది. తమకు అనుకూల ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో రష్యా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు విక్టర్ యన్కోవిచ్‌ను అధ్యక్షపీఠంపై కూర్చోబెట్టేందుకు యత్నాలు జరుగుతున్నాయి. గతంలో యన్కోవిచ్‌కు వ్యతిరేకంగా ప్రజాందోళనలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన దేశం విడిచి రష్యాకు పారిపోయారు. ప్రస్తుతం బెలారుస్ రాజధాని మిన్‌స్క్‌లో యన్కోవిచ్ ఉన్నట్టు సమాచారం. ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీ‌ను తొలగించి యన్కోకోవిచ్‌కు ఉక్రెయిన్ పగ్గాలు అప్పగించే ప్రయత్నాల్లో రష్యా ఉన్నట్లు తెలుస్తోంది.

  • 02 Mar 2022 05:21 PM (IST)

    ఉక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి

    ఉక్రెయిన్ దేశం లో మరో భారతీయ విద్యార్థి దుర్మరణం పాలయ్యారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన చందన్ జిందాల్ (22) అనే విద్యార్థి… ఉక్రెయిన్ దేశం లో మృతి చెందినట్లు సమాచారం. జిందాల్ ఇస్కీమిక్ స్ట్రోక్‌ అనే వ్యాధి కారణంగా మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే భారతీయ విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో మెడికల్ విద్యను అభ్యసిస్తున్నాడు జిందాల్. అనారోగ్యంగా కారణంగా విన్నిట్సియాలోని అత్యవసర ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

  • 02 Mar 2022 03:44 PM (IST)

    US ఆంక్షల ప్రభావం లేదు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్

    రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలు ఐఏఎఫ్‌పై పెద్దగా ప్రభావం చూపబోవని భారత వాయుసేన వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ సందీప్‌ సింగ్‌ అన్నారు. రెండు దేశాలతో భారత్ సంబంధాలు దృఢంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు వైమానిక దళం రోజుకు నాలుగు విమానాలను పంపగలదని ఆయన అన్నారు. ఒక రౌండ్‌లో 200 మందిని వెనక్కి తీసుకువస్తారు. భారతీయులందరినీ క్షేమంగా వెనక్కి తీసుకువస్తామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఉదయం నుండి, భారతీయులను తరలించడానికి మూడు వైమానిక దళ విమానాలను పంపారు. తరలింపు ఆపరేషన్ 24 గంటల్లో కొనసాగుతుంది. రిలీఫ్ మెటీరియల్ కూడా పంపుతున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ ఆపరేషన్ కొనసాగుతోందని యిర్‌ మార్షల్‌ సందీప్‌ సింగ్‌ తెలిపారు.

  • 02 Mar 2022 03:42 PM (IST)

    ఇప్పటివరకు దాడిలో రష్యా ఎంత నష్టపోయిందంటే?

    యుద్ధంలో రష్యాకు జరిగిన నష్టాన్ని ఉక్రెయిన్ సైన్యం అంచనా వేసింది. దీనికి సంబంధించి సవివరమైన సమాచారం అందించారు.

  • 02 Mar 2022 03:37 PM (IST)

    కైవ్‌లోరెండు భారీ పేలుళ్లు

    రష్యా క్షిపణి దాడుల బెదిరింపుల మధ్య ఉక్రెయిన్ రాజధాని కైవ్ ఈరోజు రెండు భారీ పేలుళ్లకు గురైంది. ఈ పేలుళ్ల ఏడవ రోజున ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై మాస్కో బాంబు దాడి చేసింది.

  • 02 Mar 2022 03:35 PM (IST)

    భారత ప్రభుత్వం నిద్రపోతోందా: అఖిలేష్ యాదవ్

    జౌన్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎస్సీ అధినేత అఖిలేష్ యాదవ్.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రపంచం మొత్తం తమ పౌరులను తీసుకువెళ్లిందని, భారత ప్రభుత్వం నిద్రపోతుందా? ఉక్రెయిన్‌లో ఇప్పటికీ వేలాది మంది చిన్నారులు సహా భారతీయులు చిక్కుకుపోయారని, అందుకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అఖిలేష్ యాదవ్ విమర్శించారు.

  • 02 Mar 2022 03:33 PM (IST)

    లొంగిపోండి లేదంటే నగరాన్ని నాశనం చేస్తారంట: మేయర్

    ఉక్రెయిన్ నగరమైన కొనోటాప్ మేయర్ సంచలన వ్యాఖ్యలు చేశారుజ రష్యన్లు మొత్తం నగరాన్ని లొంగిపోతారని, లేకుంటే పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించారని పేర్కొన్నారు.

  • 02 Mar 2022 03:16 PM (IST)

    ఖర్కివ్ నగరంపై రష్యా భీకర దాడులు.. షాకింగ్ వీడియో

    ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పరంపర కొనసాగుతోంది. రష్యా దాడులతో ఖర్కివ్‌ నగరం గజగజ వణికిపోతోంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రాంతీయ కార్యాలయంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 21 మంది మృతి చెందగా, 112 మంది గాయపడినట్లు ఖర్కివ్ నగర మేయర్ తెలిపారు.

  • 02 Mar 2022 02:54 PM (IST)

    ఢిల్లీకి చేరుకున్న 23 మంది తెలంగాణ విద్యార్థులు

    యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి తెలంగాణ విద్యార్థులు భారత్ చేరుకుంటున్నారు. ఆపరేషన్ గంగాలో భాగంగా ప్రత్యేక విమానంలో ఇవాళ 23 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. విద్యార్థులను రిసీవ్ చేసుకున్న తెలంగాణ భవన్ అధికారులు.. వారిని సాయంత్రం ఢిల్లీ నుంచి విద్యార్థుల స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు.

  • 02 Mar 2022 02:48 PM (IST)

    తెలుగు విద్యార్థులను తరలించేందుకు ఏపీ ప్రతినిధులు

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయునుల స్వదేశానికి తరలించే ఆపరేషన్ గంగా ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం ఏపీ ప్రతినిధులు పోలీండ్, హంగేరికి వెళ్లనున్నారు. విద్యార్థుల తరలింపు కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

  • 02 Mar 2022 01:04 PM (IST)

    అంతరిక్ష పరిశోధన సంస్థలోని సైంటిస్టులను వెనక్కి రప్పించిన రష్యా

    రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థలోని సైంటిస్టులను వెనక్కి తీసుకొస్తోంది. బుధవారం 29 మంది మాస్కోకు చేరుకున్నట్టు ప్రకటన చేసింది రష్యా. అక్కడ మిగిలిన మరో 59 మందిని ఏ క్షణమైనా వెనక్కి రప్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

  • 02 Mar 2022 12:47 PM (IST)

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం కంట్రోల్ రూమ్‌

    ఆపరేషన్ గంగా కింద ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం పోలాండ్, రొమేనియా, హంగేరీ, స్లోవాక్ రిపబ్లిక్‌లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు జారీ చేసిన నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా సహాయం పొందవచ్చు.

  • 02 Mar 2022 12:31 PM (IST)

    భారత విమానాలను అడ్డుకున్న అమెరికా.. ఆ దారిలో వస్తే కుదరదంటూ ప్రకటన

    అమెరికా నుంచి భారత్​లోని ముంబై, ఢిల్లీకి చేరేందుకు రష్యా గగనతలాన్ని వినియోగించటాన్ని నిలిపివేసినట్లు అగ్రరాజ్యానికి చెందిన యునైటెడ్​ ఎయిర్​లైన్స్​ బుధవారం ప్రకటించింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని విమానయాన సంస్థ ప్రతినిధి చెప్పారు. అయితే, పూర్తి వివరాలు వెల్లడించలేదు.

  • 02 Mar 2022 12:02 PM (IST)

    మారియుపోల్‌ సహా ముఖ్యనగరాల్లో భీకర పోరు.. భీకర దాడుల్లో 16 మంది చిన్నారులు మృతి

    మారియుపోల్‌ సహా ముఖ్యనగరాల్లో భీకర పోరు కొనసాగుతోంది. 56 రాకెట్లు, 113 క్షిపణులను రష్యా ప్రయోగించింది. భీకర దాడుల్లో 16 మంది చిన్నారులు సహా 352 మంది పౌరులు మృతి చెందారు.

  • 02 Mar 2022 12:01 PM (IST)

    కీవ్‌లో టీవీ టవర్‌ను ధ్వంసం చేసిన రష్యా బలగాలు

    ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. సైనిక స్థావరాలతో పాటు జనావాసాలపై దాడులు చేస్తోంది. కీవ్‌పై పట్టుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన రష్యా.. కీవ్‌, ఖార్కీవ్‌పై బాంబుల మోత మోగిస్తోంది. కీవ్ వైపు ట్యాంకులతో దూసుకొస్తోంది రష్యా. కీవ్‌లో టీవీ టవర్‌ను రష్యా బలగాలు ధ్వంసం చేయడంతో ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది.

  • 02 Mar 2022 11:58 AM (IST)

    ఖార్కివ్‌లోని ఆస్పత్రులను టార్గెట్ చేసిన రష్యా సైన్యం

    ఖార్కివ్‌లోని ఆస్పత్రులను టార్గెట్ చేసింది రష్యా సైన్యం. ఉక్రెయిన్ సైనికులు అక్కడ ఉన్నారనే సమాచారంతో రాకెట్ లాంచర్లతో దాడి చేస్తోంది.

  • 02 Mar 2022 11:55 AM (IST)

    ఖార్కివ్ నగరంపై దాడులను ముమ్మరం.. ఆర్మీ స్థావరాలు స్వాధీనం..

    ఖార్కివ్ నగరంపై దాడులను ముమ్మరం చేసింది రష్యా సైన్యం. ఇప్పటికే ఈ నగరంలోని అన్ని ఆర్మీ స్థావరాలను స్వాధీనం చేసుకుంది. అంతటితో వదలిపెట్టకుండా ఖార్కివ్ నగరంలో రష్యా సైనికులు వైమానిక దాడులు నిర్వహిస్తున్నారు. అయితే రష్యా సైనికుల దాడులను ధీటుగా ఎదుర్కొంటున్నారు ఉక్రేనియన్ సైనికులు. 

  • 02 Mar 2022 11:30 AM (IST)

    ఖెర్సన్ ఓడరేవును స్వాధీనం చేసుకున్న రష్యన్ సైన్యం

    ఉక్రెయిన్‌కు సంబంధించిన రెండు ఆర్మీ స్థావరాలతోపాటు ఖెర్సన్ ఓడరేవును రష్యన్ సైన్యం స్వాధీనం చేసుకుంది.

  • 02 Mar 2022 11:28 AM (IST)

    ఖేర్సన్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా సైన్యం

    ఖేర్సన్‌ను స్వాధీనం చేసుకుంది రష్యా సైన్యం. మరోవైపు కైవ్-ఖార్కివ్‌లో బాంబు దాడి కూడా తీవ్రతరం చేసింది.

  • 02 Mar 2022 11:27 AM (IST)

    మోల్డోవాలోని భారత రాయబారితో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమావేశం

    ఉక్రెయిన్-రష్యా సంక్షోభం మధ్యలో రొమేనియా మోల్డోవాలోని భారత రాయబారి రాహుల్ శ్రీవాస్తవతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమావేశం అయ్యారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను ఎలా తీసుకురావాలనే అంశంపై చర్చించారు. 

  • 02 Mar 2022 11:25 AM (IST)

    ఉక్రెయిన్ నుంచి భారత్‌‌కు ఆరు విమానాలు బయలుదేరాయి: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

    ఉక్రెయిన్ నుంచి భారతీయులను ఆరు విమానాల్లో తీసుకొస్తున్నట్లుగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. పోలాండ్ నుంచి మొదటి విమానం కూడా బయలుదేరిందని అన్నారు.

  • 02 Mar 2022 10:38 AM (IST)

    ఉక్రెయిన్‌లోని భారతీయుల కోసం వాయుసేన విమానాల్లో టెంట్లు, బ్లాంకెట్ల

    ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ఆపరేషన్​ గంగాలో భాగంగా.. వాయుసేనకు చెందిన మరో మూడు రవాణా విమానాలు పోలండ్​, హంగెరీ, రొమేనియాకు బుధవారం వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే సీ-17 గ్లోబ్​మాస్టర్​ ఎయిర్​క్రాఫ్ట్​ బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు పలు సామగ్రితో బయలుదేరి వెళ్లింది. వాయుసేన విమానాల్లో టెంట్లు, బ్లాంకెట్ల వంటి ఇతర సామగ్రిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మూడు విమానాలు హిందోన్​ ఎయిర్​బేస్​ నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

  • 02 Mar 2022 09:15 AM (IST)

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ప్రజలకు భారతీయల కోసం నమ్కీన్ మూంగ్ దాల్, ఆలూ భుజియా..

    పోలాండ్ మీదుగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం మంగళవారం ఔషధాలు , ఇతర సహాయక సామగ్రిని మొదటి సరుకును పంపింది కేంద్ర ప్రభుత్వం. మందులే కాకుండా ఆహార పదార్థాలు కూడా పంపించారు. వైమానిక దళం C-17 విమానం పంపిన వస్తువులలో నమ్కీన్ మూంగ్ దాల్, బంగాళాదుంప భుజియా కూడా ఉంది. ANI విడుదల చేసిన ఫుటేజ్ ప్రకారం..

  • 02 Mar 2022 09:11 AM (IST)

    రష్యా ఎటాక్స్‌తో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి

    రష్యా ఎటాక్స్‌తో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. కీవ్‌పై పట్టు కోసం రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రష్యన్‌ బలగాలు కీవ్‌ను చుట్టుముడుతున్నాయి. సుమారు 64 కిలోమీటర్ల పొడవైన యుద్ధ ట్యాంకుల కాన్వాయ్‌ కీవ్‌లోకి ఎంటరైంది. కీవ్‌ను చుట్టుముట్టిన రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మిస్సైల్స్‌, ఫిరంగులతో ఎటాక్స్‌ చేస్తున్నారు. లేటెస్ట్‌గా 56 రాకెట్లు, 113 క్షిపణులను ప్రయోగించింది రష్యా.

  • 02 Mar 2022 08:47 AM (IST)

    ఉక్రెయిన్‌తో యూరోపియన్ యూనియన్ దేశాలు..

    మునుపెన్నడూ లేని విధంగా ఈ సమయంలో పుతిన్ ప్రపంచం నుంచి చాలా ఒంటరిగా మారారని అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ అన్నారు. యూరోపియన్ యూనియన్‌లోని దాదాపు 30 దేశాలు ప్రస్తుతం ఉక్రెయిన్‌తో ఉన్నాయని స్పష్టం చేశారు.

  • 02 Mar 2022 07:43 AM (IST)

    రష్యాపై మెక్సికో కీలక నిర్ణయం..

    ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యాపై తమ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక ఆంక్షలు విధించబోదని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ స్పష్టంచేశారు. విదేశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని పేర్కొన్నారు.

  • 02 Mar 2022 07:41 AM (IST)

    రష్యా విమానాల రాకపోకలపై నిషేధం

    అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం విధించేందుకు అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఐరోపా సమాఖ్య, కెనడా దేశాలు తమ గగనతలంపై నుంచి రష్యా విమానాలు రాకపోకలు సాగించకుండా నిషేధించిన తర్వాత యూఎస్ ఈ దిశగా యోచిస్తోంది.

  • 02 Mar 2022 07:01 AM (IST)

    ఉక్రెయిన్ నుంచి చేరుకున్న మరో రెండు విమానాలు..

    ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. భారతీయులతో  మరో రెండు విమానాలు ఢిల్లీకి చేరుకున్నాయి. వారిని కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు.

  • 02 Mar 2022 06:58 AM (IST)

    యుద్ధంలో పాల్గొనే ఆలోచన లేదు.. నాటో

    యుద్ధంలో పాల్గొనే ఆలోచన లేదని నాటో చీఫ్ స్పష్టంచేశారు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.

  • 02 Mar 2022 06:50 AM (IST)

    రష్యా దాడిలో నలుగురు మృతి..

    ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా క్రూయిజ్ క్షిపణి దాడి చేయడంతో ఉక్రెయిన్ నగరమైన జైటోమిర్‌లో నలుగురు వ్యక్తులు మరణించారని ఉక్రెయిన్ అంతర్గత మంత్రి సలహాదారు అంటోన్ గెరాష్చెంకో తన టెలిగ్రామ్ ఛానెల్‌లో తెలిపారు. క్షిపణి ఇళ్లపై పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

  • 02 Mar 2022 06:48 AM (IST)

    ఏడో రోజుకు చేరిన యుద్ధం..

    రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఏడో రోజు కూడా రష్యా.. పొరుగు దేశం ఉక్రెయిన్‌పై తన దాడులను తీవ్రతరం చేసింది.

Follow us on