Russia: బొగ్గు గనిలో భారీ అగ్ని ప్రమాదం.. 52 మంది సజీవ సమాధి.. భూగర్భంలో మరో 200 మంది కార్మికులు..

రష్యాలోని సైబీరియాలోని బొగ్గు గనిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 52 మంది మృతి చెందగా, పెద్ద సంఖ్యలో గాయపడ్డారు.

Russia: బొగ్గు గనిలో భారీ అగ్ని ప్రమాదం.. 52 మంది సజీవ సమాధి.. భూగర్భంలో మరో 200 మంది కార్మికులు..
Death Toll Soars To 52 In R
Follow us

|

Updated on: Nov 26, 2021 | 9:04 AM

రష్యాలోని సైబీరియాలోని బొగ్గు గనిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 52 మంది మృతి చెందగా, పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. రష్యాలోని సైబీరియాలో ఈ పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ కెమెరోవో ప్రాంతంలోని బొగ్గు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 52 మంది చనిపోయారు. ఆరుగురు సెక్యురిటీ అధికారులు కూడా ఈ ఘటనలో బలయ్యారు. ఐదేళ్లలో అత్యంత ఘోరమైన గని ప్రమాదంగా భావిస్తున్నారు రష్యన్ అధికారులు. Listvyazhnaya గనిలో ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించే అవకాశం లేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. చాలా మృతదేహాలు ఇంకా లోపల ఉన్నాయి. వాటిని ఉపరితలంపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బొగ్గు పొగ కారణంగా వెంటిలేషన్ సమస్యతో 11 మంది మైనర్లు మరణించినట్లు తొలత వార్తలు వచ్చాయి. 250 మీటర్ల లోతులో ఉన్నటువంటి వారిని గుత్తించడం రెస్క్యూ టీమ్స్‌కు కష్టంగా మారింది. అయితే కొందరు కార్మికులను మాత్రం రక్షించారు. అందులో 38 మందిని ఆసుపత్రిలో చేర్చారని..వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.  ప్రమాదం జరిగిన సమయంలో 285 మంది భూగర్భంలో పని చేస్తున్నారు. వారిలో ఎక్కువ మందిని ముందుగానే గని నుండి బయటకు తీశారు.

పెద్ద పేలుడు తర్వాత అగ్ని

బొగ్గు గని సంఘటన గురించి మాట్లాడుతూ.. బలమైన పేలుడు తర్వాత ఈ మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఈ పేలుడు అకస్మాత్తుగా జరిగింది. అయితే ఈ పేలుడు ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘ప్రగాఢ సానుభూతి’ తెలిపారు. అదే సమయంలో కెమెరోవో ప్రాంతం శుక్రవారం నుండి ఆదివారం వరకు మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.

ఇవి కూడా చదవండి: Success Mantras: విజయానికి నాలుగు మెట్లు.. వీటిని అర్థం చేసుకున్న వారికి ఏదీ అసాధ్యం కాదు..

Constitution Day 2021: నవంబర్ 26 ప్రత్యేక ఏంటో తెలుసా.. ప్రతి ఒక్కరు ఈ రోజు స్పెషల్ ఎంటో తెలుసుకోవాలి..