Russia-Ukraine War: పుతిన్‌కు మోదీ ఫోన్ కాల్.. భారతీయులు వెళ్లేందుకు 6 గంటల వెసులుబాటు

|

Mar 02, 2022 | 8:48 PM

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. భారత విద్యార్థులను రష్యా మీదుగా తరలించాలని మోదీ కోరారు.

Russia-Ukraine War: పుతిన్‌కు మోదీ ఫోన్ కాల్.. భారతీయులు వెళ్లేందుకు 6 గంటల వెసులుబాటు
Modi And Putin
Follow us on

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. భారత విద్యార్థులను రష్యా మీదుగా తరలించాలని మోదీ కోరారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని రిక్వెస్ట్ చేశారు. భారతీయ విద్యార్థులకు సేఫ్‌ ప్యాసేజ్‌ కల్పించేందుకు రష్యా అంగీకరించింది. ఇండియన్ స్టూడెంట్స్ ఖార్కివ్ వీడి వెళ్లేందుకు  6 గంటల వెసులుబాటు కల్పించింది రష్యా. ఈ క్రమంలో ఖార్కియెవ్‌లోని భారతీయులకు ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ మరో అడ్వైజరీ జారీ చేసింది. వాహనాలు, బస్సులు అందుబాటులో లేకపోతే కాలినడకనన అక్కడి నుంచి తరలివెళ్లమని సూచించింది.  అక్కడి నుంచి PESOCHIN 11 కి.మీ దూరంలో ఉందని, BABAYE 12 కి.మీ, BEZLYUDOVKA 16 కి.మీ దూరంలో ఉన్నాయని వెల్లడించింది.  అక్కడ ఉన్న ఇండియన్స్ అంతా సాయంత్రం 6.00 (ఉక్రెయిన్ కాలమానం), రాత్రి 9:30(భారత కాలమానం)  లోపు ఖార్కియెవ్‌ను విడిచివెళ్లాలని అంతకుముందు జారీ చేసిన అడ్వైజరీలో తెలిపింది. కాగా భారత ఎంబసీ కూడా కీవ్‌ను నుంచి లివిన్‌కు మారినట్లు తెలుస్తోంది.

కాగా ఉక్రెయిన్‌ దురాక్రమణలో రష్యాని ముప్పతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్ళు తాగిస్తోంది ఉక్రెయిన్‌ సైన్యం. కీవ్‌, ఖార్కీవ్‌ నగరాల ఆక్రమణకి మాస్కో సేనలు మల్లగుల్లాలు పడుతున్నాయి. యుద్ధరంగంలో ఉక్రెయిన్‌ పౌరుల భాగస్వామ్యం రష్యాకి చుక్కలు చూపిస్తోంది. ఒక్కో నగరంపై ఆధిక్యం రష్యన్‌ సేనలకు సవాల్‌గా మారుతోంది. చిట్టచివరకు ఉక్రెయిన్‌ దురాక్రమణ సాధ్యమైనా, అది నల్లేరు మీద నడకేం కాదన్నది నిపుణుల నుంచి వినిపిస్తున్న మాట. మరోవైపు రష్యా దూకుడుకి కళ్లెం వేసేందుకు ప్రపంచ దేశాలు పావులు కదుపుతున్నాయి. అమెరికా గగనతలంలో రష్యా విమానాలపై అమెరికా నిషేధం విధించింది. బ్రిటన్‌ సహా పలుదేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యాపై అనేక దేశాలు ఆంక్షలను తీవ్రం చేశాయి. అయితే చైనా వెన్నుదన్నుగా ఉన్నా రష్యా కి ఉక్రెయిన్‌ కొరుకుడుపడని కొయ్యలానే ఉండడం విశేషం.

Also Read: Russia-Ukraine War: రష్యా దాడుల బీభత్సం… కాలినడకన ఉక్రెయిన్‌ నుంచి ఎస్కేప్ అయిన స్టార్ హీరో!