Roman bath complex: బీచ్ లో పురాతన స్నాన సముదాయం ఒకటి బయటపడింది. ఇప్పడు ఇది పరిశోధకులను విపరీతంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దక్షిణ స్పెయిన్ లో ఒక బీచ్ లో ఇసుకలో కప్పబడి ఉంది ఈ స్నానపు సముదాయం. ఇది రోమన్ స్నాన సముదాయంగా గుర్తించారు. స్పెయిన్లోని అండలూసియా ప్రాంతంలోని కానోస్ డి మెకా బీచ్ వద్ద 13 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో గోడలతో చక్కగా సంరక్షించబడిన రోమన్ స్నానాల గదుల సముదాయాన్ని యూనివర్శిటీ ఆఫ్ కాడిజ్ (యుసిఎ) పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో ఇప్పటివరకు రెండు గదులు మాత్రమే తవ్వకాలు జరిగాయి, చాలావరకు సైట్ ను ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ స్థలం 2.5 ఎకరాలలో విస్తరించి ఉంటుందని యుసిఎ తెలిపింది.
ఇప్పటి వరకూ తవ్విన రెండు గదుల గోడలు ఇసుకతో కప్పబడి ఉన్నాయి “అవి పురాతన కాలంలో వాడి వదిలివేసినవి. వదిలివేయబడిన తరువాత క్రమేపీ ఇసుకలో కప్పబడి పోయాయి.” అని యుసిఎ తెలిపింది. ఇదే ప్రాంతంలో
12 మరియు 13 వ శతాబ్దాలకు చెందిన కొన్ని మధ్యయుగ సిరామిక్స్ కూడా కనుగొన్నారు. అండలూసియా లోని కేప్ ట్రఫాల్గర్ పై ప్రత్యేక యుసిఎ తవ్వకంలో, కనీసం ఏడు రోమన్ సాల్టింగ్ కొలనులు కనుగొన్నారు. అదీకాకుండా ఆహారాన్ని సంరక్షించడానికి ఉపయోగించే 5 అడుగుల నుండి 6.5 అడుగుల లోతు వరకు ఉన్న గదులు కూడా ఇక్కడ ఉన్నాయి. రెండు కొలనులలో కొన్ని “రోమన్ సంరక్షణ యొక్క అవశేషాలు” కనుగోన్నారు. అని UCA తెలిపింది.
రోమన్ కళాఖండాలతో పాటు, వారు కేప్ ట్రఫాల్గర్ సైట్ వద్ద చెక్కుచెదరకుండా ఉన్న చరిత్ర పూర్వ సమాధిని కూడా కనుగొన్నారు. ఈ సమాధి 4,000 సంవత్సరాల పురాతనమైనదని, ఇక్కడ అనేక మంది వ్యక్తుల అవశేషాలు ఉన్నాయని విశ్వవిద్యాలయం తెలిపింది.
“ఇది చాలా అద్భుతంగా ఉంది” అని అండలూసియా సంస్కృతి మంత్రి ప్యాట్రిసియా డెల్ పోజో అన్నారు, త్రవ్వకాల్లో ఈ ప్రాంతం “అన్ని రకాల నాగరికతలకు నమ్మశక్యం కాని ఆకర్షణీయమైన ప్రాంతం” అని, ఇది మాకు అద్భుతమైన చరిత్రను ఇస్తుందని అన్నారు. గత సంవత్సరం, తూర్పు స్పెయిన్‌లోని అలికాంటేలో ఒక సీఫుడ్ దుకాణాన్ని పరిశీలించేటప్పుడు, ఆంఫోరే అని పిలువబడే పురాతన రోమన్ కంటైనర్ల సేకరణను అధికారులు అనుకోకుండా కనుగొన్నారు.
అధికారులు ఈ పరిశోధనలను స్పెయిన్ యొక్క విద్య, సంస్కృతి మరియు క్రీడా మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువచ్చారు.ఈ కంటైనర్లు రోమన్ సామ్రాజ్యం నుండి వచ్చాయని అదేవిధంగా మొదటి శతాబ్దం నాటిదని నిర్ధారించారు.
CNN షేర్ చేసిన పురాతన స్నానపు గదుల వీడియో ట్వీట్..
A well-preserved ancient Roman bath complex has emerged from the sands of a beach in southern Spain https://t.co/6ywXlPTkoc pic.twitter.com/FVMT2g8W9C
— CNN (@CNN) May 23, 2021
రండి బాబు… రండి..! టీకా తీసుకోండి…! కోట్ల డాలర్లు గెలుచుకోండి..! ఆఫర్లు ప్రకటించిన అమెరికా సర్కార్