పుతిన్ దూకుడు చర్యలతో మూడో ప్రపంచ యుద్ధం? బ్రిటన్ నిఘా అధికారి సంచలన హెచ్చరిక!

ప్రపంచ దేశాలను మరోసారి యుద్ధ భయం వెంటాడుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి కారణంగా అనుకోకుండా మూడో ప్రపంచ యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందని బ్రిటన్ రక్షణ నిఘా విభాగం అధిపతి హెచ్చరించినట్లు ఓ కథనం వెల్లడించింది. రష్యా ప్రస్తుతం నాటో (NATO) దేశాలతో నేరుగా యుద్ధం చేయాలని భావించడం లేదని, అయితే ఆ దేశం తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు, నిర్లక్ష్యపూరిత చర్యలు తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు..

పుతిన్ దూకుడు చర్యలతో మూడో ప్రపంచ యుద్ధం? బ్రిటన్ నిఘా అధికారి సంచలన హెచ్చరిక!
UK Intelligence Chief Issues Serious Warning Over Putin

Updated on: Nov 22, 2026 | 9:13 AM

బ్రిటన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ లెఫ్టినెంట్ జనరల్ మాథ్యూ జోన్స్ శుక్రవారం సాయంత్రం కేంబ్రిడ్జ్‌లో జరిగిన ఇంటెలిజెన్స్ సెమినార్‌లో ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఆయన ప్రసంగానికి సంబంధించిన వివరాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. రష్యా నాటోతో యుద్ధాన్ని కోరుకోవడం లేదని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు మాథ్యూ జోన్స్ పేర్కొన్నారు. అయితే రష్యా ప్రవర్తనలో రోజురోజుకూ దూకుడు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘రష్యా నాటోతో యుద్ధాన్ని చురుగ్గా కోరుకోవడం లేదని నేను విశ్వాసంతో చెప్పగలను. అయితే నా ప్రధాన ఆందోళన మాత్రం తీవ్రమైన పొరపాటు నిర్ణయం లేదా తప్పుడు అంచనా వల్ల తలెత్తే ప్రమాదమే. పుతిన్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నారు. ఆ పరిస్థితి ఇతర దేశాలను సవాలు చేసేలా మరింత దూకుడుగా వ్యవహరించడానికి దారితీస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో రష్యా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన ఘటనలు అనేకం ఉన్నాయని, వాటిలో ఏ ఒక్క ఘటనలోనైనా పరిస్థితులు కొద్దిగా భిన్నంగా ఉంటే తీవ్ర పరిణామాలు ఎదురయ్యేవని ఆయన హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, డెన్మార్క్‌లో ఉక్రేనియన్-అమెరికన్ పౌరుడిని హత్య చేసేందుకు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుట్రను అక్కడి అధికారులు అడ్డుకున్నట్లు డైలీ మెయిల్ కథనం పేర్కొంది. ఈ కుట్ర వెనుక రష్యా నిఘా విభాగం ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చినట్లు తెలిపింది. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి ఉక్రేనియన్-అమెరికన్ ర్యాపర్‌గా కథనం పేర్కొంది. ఈ ఘటనపై యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ తీవ్రంగా స్పందించారు. దీనిని యూరోపియన్ యూనియన్ భూభాగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలు తమ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని శనివారం వ్యాఖ్యానించారు. బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి ఎడ్ మిలిబాండ్ కూడా డెన్మార్క్‌కు సంఘీభావం ప్రకటించారు. నాటో మిత్రదేశ భూభాగంలో జరిగిన ఈ హత్యాయత్నం తీవ్రంగా ఖండించదగినదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

రష్యాతో యుద్ధం కోరుకోవడం లేదు: బ్రిటన్

రష్యాతో యుద్ధం లేదా ఘర్షణను బ్రిటన్ కోరుకోవడం లేదని జనరల్ మాథ్యూ జోన్స్ స్పష్టం చేశారు. అయితే తమ దేశ భద్రతకు, మిత్రదేశాల భద్రతకు ముప్పు ఏర్పడితే మాత్రం గట్టిగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. మరోవైపు 2030 నాటికి యుద్ధానికి సిద్ధంగా ఉండేలా బ్రిటన్ తన రక్షణ సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి వెస్ స్ట్రీటింగ్ కూడా వ్యాఖ్యానించినట్లు డైలీ మెయిల్ కథనం వెల్లడించింది.

రష్యా-నాటో దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా హెచ్చరికలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇరుపక్షాలు ప్రత్యక్ష యుద్ధాన్ని కోరుకోకపోయినా, ఏదైనా చిన్న పొరపాటు లేదా అనుకోని సైనిక పరిణామం పరిస్థితులను పూర్తిస్థాయి ఘర్షణ దిశగా నడిపించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా దూకుడు చర్యలు, యూరప్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ భద్రతకు సవాలుగా మారుతున్నాయన్న హెచ్చరికలు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త సిలబస్‌తో ఫార్మసీ విద్యలో సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల అనుభవం, పరిశోధనా నైపుణ్యాలకు మరింత ప్రాధాన్యత లభించనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us