Russia – Ukraine Crisis: రష్యా(Russia) దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ(Volodymyr Zelenskyy) సంచలన ప్రతిజ్ఞ చేశారు. ప్రాణాలు పోయినా సరే రష్యాకు లొంగేది లేదని స్పష్టం చేశారు. కయ్యానికి కాలు దువ్విన రష్యాకు తగిన గుణపాఠం నేర్పిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. యూరోపియన్ యూనియన్‌లో చేరతామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దరఖాస్తు చేయడంతో ఇవాళ అత్యవసర “యూరోపియన్ యూనియన్” పార్లమెంట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జెలెన్‌స్కీ.. కీలక ప్రసంగం చేశారు. ఈ కష్టకాలంలో ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని కోరారు. రష్యా దాడుల్లో అమాయక పౌరులు, చిన్నారులు చనిపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జెలెన్‌స్కీ. అంతేకాదు.. జనావాసాలపై వాక్యూమ్ బాంబులు, క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. రష్యా యుద్ద నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈయూలో ఉక్రెయిన్‌కు వీలైనంత త్వరగా సభ్యత్వం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారాయన. జెలెన్‌స్కీ ప్రసంగానికి ఈయూ సభ్యులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఉక్రెయిన్‌కి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Also read:
Diabetics: షుగర్ పేషెంట్లు ఈ పండ్లని తింటున్నారా.. ఒక్కసారి ఇవి గమనించండి..!
Operation Ganga: ప్రతి ఒక్క భారతీయుడినీ స్వదేశానికి చేర్చడమే.. ఆపరేషన్ గంగ ప్రధాన లక్ష్యం