Putin: పుతిన్ కు బర్త్ డే గిఫ్ట్.. ట్రాక్టర్ ను అందజేసిన బెలారస్‌ అధ్యక్షుడు.. ఆంతర్యం ఏమిటో..

ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పుట్టిన రోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. అక్టోబర్ 7న తన 70వ జన్మదిన వేడుకను నిర్వహించుకున్నారు. ఉక్రెయిన్‌లో ఎదురుదెబ్బలు, ఆ దేశంపై సైనిక చ‌ర్యపై..

Putin: పుతిన్ కు బర్త్ డే గిఫ్ట్.. ట్రాక్టర్ ను అందజేసిన బెలారస్‌ అధ్యక్షుడు.. ఆంతర్యం ఏమిటో..
Belarus Gift

Updated on: Oct 08, 2022 | 3:59 PM

ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పుట్టిన రోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. అక్టోబర్ 7న తన 70వ జన్మదిన వేడుకను నిర్వహించుకున్నారు. ఉక్రెయిన్‌లో ఎదురుదెబ్బలు, ఆ దేశంపై సైనిక చ‌ర్యపై స్వదేశంలో తీవ్ర వ్యతిరేక‌త ఎదుర్కొంటున్న పుతిన్ కు ఉత్సాహం క‌లిగించేలా బెలార‌స్ అధ్యక్షుడు, సన్నిహిత మిత్రుడు అలెగ్జాండర్ లుకాషెంకో పుతిన్ కు పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఇచ్చారు. అక్టోబరు 7న పుతిన్ సొంత న‌గ‌రం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని కాన్‌స్టాంటిన్ ప్యాలెస్‌లో ఈ ఇద్దరు నాయకులు కలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బెలార‌స్‌లో తయారు చేసిన ట్రాక్టర్‌కు బహుమతిగా ఇస్తూ ధృవీకరణ పత్రాన్ని రష్యా అధ్యక్షుడికి లుకాషెంకో అందించారు. 1994 నుంచి బెలారస్‌ను ఉక్కు పిడికిలితో పాలించిన లుకాషెంకో, తన సొంత తోటలో అదే మోడల్ ట్రాక్టర్‌ను ఉపయోగించారు. ఈ బహుమతికి పుతిన్‌ తక్షణ స్పందన తెలియనప్పటికీ, ట్రాక్టర్లతో ఆయ‌న‌కు సుదీర్ఘ అనుబంధం ఉంది. అనేక సందర్భాల్లో వాటితో ఫోటో తీసుకున్నారు.

2005లో హనోవర్‌లో జరిగిన ఒక వాణిజ్య ప్రదర్శనలో అప్పటి జర్మన్ ఛాన్సలర్ గెర్హార్డ్ ష్రోడర్‌తో వ్యవసాయ ట్రాక్టర్ పై ఆనందంగా ప్రయాణించారు. 2010లో టాంబోవ్‌లో ఒక ట్రాక్టర్ చక్రం ముందు ఫొటో దిగారు. 2018లో పుతిన్ రష్యాలోని రోస్టోవ్-ఆన్-డాన్‌లోని ఒక కర్మాగారంలో ట్రాక్టర్‌లో ప్రయాణించారు. ట్రాక్టర్‌తో పాటు, పుతిన్‌కు మిత్రదేశాలు, స్నేహపూర్వక రాష్ట్రాల అధినేతల నుంచి విలాసవంతమైన బహుమతులు లభించాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు.. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్ర తరమవుతోంది. శత్రుదేశంపై ఆయుధాలు, క్షిపణులు దాడులతో విరుచుకుపడుతున్న పుతిన్ సేన ఓ వైపు.. వాటిని అంతే ధైర్యంగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ బలగాలు మరోవైపు.. ఇరు దేశాల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. ఈ పరిస్థితిలో బెలారస్ అధ్యక్షుడు పుతిన్ కు ట్రాక్టర్ ను గిఫ్ట్ గా అందజేయడంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తు్న్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..