తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్! వాటికన్ కీలక ప్రకటన

క్రైస్తవ ఆథ్యాత్మిక గురువు పోప్ ఫ్రాన్సిస్ ఆస్పత్రి లో చేరారు. శ్వాసకోశ సంబంధిత పాలీ మైక్రోబయల్ ఇన్ఫెక్షన్‌ తో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెలల్లడించారు. మరి ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్! వాటికన్  కీలక ప్రకటన
Pope Francis

Updated on: Feb 18, 2025 | 9:29 AM

క్రైస్తవ ఆథ్యాత్మిక గురువు 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోశాన్ని ప్రభావితం చేసే పాలీమైక్రోబయల్ ఇన్ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలె ఈ ఇన్ఫెక్షన్‌కు సంబంధించి పలు టెస్టులు చేయగా, ఆయన ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందడం అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆయన రోమ్‌లోని అగోస్టినో జెమెల్లి పాలీక్లినిక్‌లో చేరారు.

అసలింతకీ ఈ పాలీమైక్రోబయల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే..? బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా శిలీంధ్రాలు వంటి బహుళ రకాల సూక్ష్మజీవులు ఒకేసారి శరీరాన్ని సంక్రమించినప్పుడు పాలీమైక్రోబయల్ ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. పోప్ ఫ్రాన్సిస్ విషయంలో, ఇన్ఫెక్షన్ అతని శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఇది ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో కారణం అవుతుంది. అయితే పోప్ ఫ్రాన్సిస్‌కు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు చాలా కాలంగా ఉన్నాయి. 2021లో పోప్ కు డైవర్టికులిటిస్, పెద్దప్రేగులో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వైద్యులు ఆపరేషన్‌ చేసి పెద్దప్రేగులో కొంత భాగాన్ని తొలగించారు. ప్రస్తుతం పోప్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండటంతో ఆయన కార్యక్రమాలన్ని రద్దు చేశారు. పోప్ ఫ్రాన్సిస్ పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ఆయన చాలా మనోధైర్యంతో ఉన్నట్లు సమాచారం.

వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూని మాట్లాడుతూ.. పోప్ బాగా నిద్రపోయారు, కొన్ని వార్తాపత్రికలు చదివి, సోమవారం ఉదయం అల్పాహారం కూడా తీసుకున్నారు. అయితే, ఆయన ఆసుపత్రిలో చేరడం వల్ల ఆదివారపు ఏంజెలస్ ప్రార్థనకు నాయకత్వం వహించలేకపోయారని అన్నారు. దాదాపు 12 సంవత్సరాల ఆయన ప్రార్థనలో పాల్గొనకపోవడం ఇది రెండవసారి మాత్రమేనని పేర్కొన్నారు. 88 సంవత్సరాల పోప్ ఫ్రాన్సిస్, చరిత్రలో అత్యంత వృద్ధ పోప్‌లలో ఒకరిగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్లకు పైగా ఉన్న కాథలిక్‌లకు పోప్‌ ఆధ్యాత్మిక నాయకుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే పోప్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని వాటికన్‌ సిటీ అధికారులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.