Poland New Abortion Law: అబార్షన్లను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చిన యూరోపియన్ దేశం.. రద్దు చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు

|

Jan 28, 2021 | 4:42 PM

ఎక్కడైనా ఏ దేశంలో నైనా ప్రభుత్వం చేసిన చట్టాలు నచ్చక పొతే ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేయడం సహజం.. తాజాగా యూరప్ లోని పోలెండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నచ్చలేదంటూ లక్షలాది మంది మహిళలు రోడెక్కారు. పోలెండ్ ప్రభుత్వం అబార్షన్లపై...

Poland New Abortion Law: అబార్షన్లను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చిన యూరోపియన్ దేశం.. రద్దు చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు
Follow us on

Poland New Abortion Law: ఎక్కడైనా ఏ దేశంలో నైనా ప్రభుత్వం చేసిన చట్టాలు నచ్చక పొతే ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేయడం సహజం.. తాజాగా యూరప్ లోని పోలెండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నచ్చలేదంటూ లక్షలాది మంది మహిళలు రోడెక్కారు. పోలెండ్ ప్రభుత్వం అబార్షన్లపై నిషేధం విధిస్తు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అబార్షన్లపై నిషేధం విధిస్తూ… అత్యాచారాలు, ప్రసవం సమయంలో తల్లిబిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసిన సమయంలో మాత్రమే అబార్షన్లకు అనుమతించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ నిర్ణయంపై ఆ దేశంలోని మహిళలు మండిపడుతున్నారు. దేశరాజధాని వార్సాలో లక్షలాది మంది మహిళలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ప్రభుత్వం చేసిన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, పోలెండ్ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. కొత్త చట్టం విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టంచేస్తోంది.

 

Also Read: సౌత్ కొరియన్ యువ నటి ఆత్మహత్య .. స్వచ్చంద సేవా సంస్థ ద్వారా వికలాంగులకు అండగా నిలబడిన సాంగ్