క్వాడ్ వేదికగా ప్రధాని మోదీ చేసిన చిన్న పనికి ప్రపంచం మొత్తం ఫిదా..!

ప్రపంచ రాజకీయాల్లో మోదీ-ట్రంప్ కెమిస్ట్రీనే వేరు..! టారిఫ్‌లు, వీసా ఆంక్షలతో అమెరికా ఒత్తిడి పెంచుతున్నా.. మోదీ మాత్రం తన పంతం వీడలేదు. అమెరికా ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే దేశ ప్రయోజనాల విషయంలో తగ్గేదేలే అంటున్న వ్యవహరించిన మోదీని ట్రంప్‌ సైతం 'టఫ్ మ్యాన్' అంటూ కితాబిచ్చారు. క్వాడ్ వేదికగా మరోసారి ఇద్దరు గ్లోబల్ లీడర్ల కలవడం హాట్‌టాపిక్‌గా మారింది.

క్వాడ్ వేదికగా ప్రధాని మోదీ చేసిన చిన్న పనికి ప్రపంచం మొత్తం ఫిదా..!
Pm Modi Picks Up Indian Flag

Updated on: Nov 18, 2026 | 7:24 AM

ప్రపంచ రాజకీయాల్లో మోదీ-ట్రంప్ కెమిస్ట్రీనే వేరు..! టారిఫ్‌లు, వీసా ఆంక్షలతో అమెరికా ఒత్తిడి పెంచుతున్నా.. మోదీ మాత్రం తన పంతం వీడలేదు. అమెరికా ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే దేశ ప్రయోజనాల విషయంలో తగ్గేదేలే అంటున్న వ్యవహరించిన మోదీని ట్రంప్‌ సైతం ‘టఫ్ మ్యాన్’ అంటూ కితాబిచ్చారు. క్వాడ్ వేదికగా మరోసారి ఇద్దరు గ్లోబల్ లీడర్ల కలవడం హాట్‌టాపిక్‌గా మారింది.

హౌడీ మోడీ అన్నా, నమస్తే ట్రంప్‌ అన్నా ఈ ఇద్దరు గ్లోబల్‌ లీడర్స్‌ మధ్య దోస్తీనే వేరు. మోదీ-ట్రంప్‌ జుగల్‌బందీనే డిఫరెంట్‌. భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించినా, సొంత కరెన్సీ వాడొద్దని గట్టిగా చెప్పినా, H1b వీసాలపై ఆంక్షలు పెట్టినా ఈ దోస్తీ మాత్రం ఆగలేదు. అందుకే మోదీ చాలా టఫ్‌ గురూ అంటున్నారు ట్రంప్‌. అమెరికా వంటి పవర్‌ఫుల్‌ కంట్రీ ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని జిత్తులు వేసినా, మోదీ ఎప్పుడూ లొంగలేదు. అందుకే మోదీ మొండిమనిషి అనే అర్థం వచ్చేలా ట్రంప్‌ పొడిగారు. ఏ సందర్భంలోనైనా మోదీ తీరు విలక్షణంగానే ఉంటుంది.

మనీలాలో జరిగిన క్వాడ్ నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఓ చిన్న పని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆసియాన్ నాయకుల సదస్సు సందర్భంగా జరిగిన క్వాడ్ నేతల గ్రూప్ ఫొటో సెషన్‌లో నేలపై ఉన్న భారత జెండా గుర్తును మోదీ స్వయంగా తీసుకుని తన జేబులో పెట్టుకున్నారు. ఫొటో కోసం నాయకులు నిలబడాల్సిన స్థానాలను సూచిస్తూ కార్పెట్‌పై ఉంచిన చిన్న తెల్లటి కార్డుపై భారత జెండా ఉంది. అది నేలపై ఉండటాన్ని గమనించిన మోదీ వంగి దానిని తీసుకున్నారు. తద్వారా దేశ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా వ్యవహరించారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని సనాయే తకైచీ కూడా పాల్గొన్నారు. మోదీ చర్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అందుకే మోదీని టఫ్‌ మ్యాన్‌ అంటూ ట్రంప్ సంబోధించారు. క్వాడ్‌ దేశాలతో తమకు సంబంధం ఉందని ప్రధాని మోదీ అన్నారు. అయితే క్వాడ్‌ కూటమి పలు అంశాల్లో సమస్యలకు విశ్వసనీయమైన పరిష్కరాలు చూపాలని మోదీ ఈ సమావేశంలో కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మోదీ-ట్రంప్‌ ఇద్దరు పాపులర్‌ గ్లోబల్‌ లీడర్లు. ఒకరు అతిపెద్ద ఆర్థికవ్యవస్థకు నాయకత్వం వహిస్తుంటే, మరొకరు ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశానికి సారధ్యం వహిస్తున్నారు. దీంతో క్వాడ్‌ కూటమి సమావేశాల్లో భాగంగా ఈ ఇద్దరూ మరోసారి కలుసుకోవడం చర్చనీయాంశమైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us