
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా చివరి దశలో న్యూజిలాండ్‌కు చేరుకున్నారు. శుక్రవారం (జూలై10) ఆయన ఆక్లాండ్ నగరంలో అడుగుపెట్టారు. ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా విమానాశ్రయానికి విచ్చేసి, ప్రధాని మోదీని ఆలింగనం చేసుకుని అత్యంత ఆత్మీయంగా, ఘనంగా స్వాగతం పలికారు.
ఇండోనేషియా, ఆస్ట్రేలియా పర్యటనల అనంతరం ఆయన ప్రయాణిస్తున్న ‘ఎయిర్ ఇండియా వన్’ ప్రత్యేక విమానం ఆక్లాండ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానం దిగి వచ్చిన ప్రధాని మోదీకి న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరి ఘనంగా స్వాగతం పలికారు. ఇద్దరు ప్రపంచ దేశాల నేతలు ఎంతో ఆత్మీయంగా కరచాలనం చేసుకుని, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. గడచిన నాలుగు దశాబ్దాలకు పైగా కాలంలో ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌లో జరుపుతున్న తొలి అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం.
Welcome to New Zealand, Prime Minister @narendramodi. pic.twitter.com/NlY0POBBaD
— Christopher Luxon (@chrisluxonmp) July 10, 2026
ప్రధాని లక్సన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఇక్కడ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గతేడాది 2025 మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ భారతదేశంలో అధికారిక పర్యటన జరిపిన సంగతి తెలిసిందే. ఆ పర్యటన ఇరు దేశాల బంధానికి కొత్త ఊపునివ్వగా, ఇటీవల భారత్-న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కూడా కుదిరింది. ఆ ఒప్పందం జరిగిన కొన్ని నెలలకే ప్రధాని మోదీ ఈ పర్యటనకు రావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
The love and affection of the New Zealand’s Indian community touched me deeply. They have waited four decades for the visit of an Indian Prime Minister and their extraordinary enthusiasm and warmth were visible today. Their bond with India remains unwavering. pic.twitter.com/7wk2vhNAbi
— Narendra Modi (@narendramodi) July 10, 2026
ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక సంబంధాల పూర్తి పరిధిని కవర్ చేస్తూ విస్తృతమైన చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఆర్థిక, వాణిజ్య, వ్యాపార సహకారాన్ని మరింత ఉన్నత స్థాయికి విస్తరించడంపై ఈ సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గత రెండేళ్లుగా భారత్, న్యూజిలాండ్ మధ్య వాణిజ్యం, వ్యాపారం, రక్షణ రంగాలలో సాధించిన గణనీయమైన పురోగతిని, తదుపరి కార్యాచరణను ఈ సందర్భంగా ఇద్దరు నేతలు సమీక్షిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధాని మోదీ చేపట్టిన ఆరు రోజుల విదేశీ పర్యటన ఈ న్యూజిలాండ్ పర్యటనతో ముగియనుంది.
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH | PM of New Zealand Christopher Luxon hugs PM Narendra Modi, as he arrives in Auckland, New Zealand for the final leg of his three-nation visit.
(Video: ANI/DD) pic.twitter.com/r5e379h19H
— ANI (@ANI) July 10, 2026
త్రివర్ణ శోభితమైన ఆక్లాండ్ స్కై టవర్
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక న్యూజిలాండ్ పర్యటనను పురస్కరించుకుని ఆక్లాండ్ నగరం సరికొత్తగా ముస్తాబైంది. ఇరు దేశాల స్నేహానికి ప్రతీకగా ఆక్లాండ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘స్కై టవర్’ (Sky Tower) ను శుక్రవారం రాత్రి భారత త్రివర్ణ పతాక వర్ణాల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ‘X’ వేదికగా పంచుకుంటూ, ప్రధాని మోదీకి ఆక్లాండ్‌లో అపూర్వ స్వాగతం లభించిందని పేర్కొన్నారు. ప్రధాని లక్సన్ ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి విమానాశ్రయంలో స్వాగతం పలకడం, స్కై టవర్‌ను త్రివర్ణ శోభితం చేయడం ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన బంధానికి నిదర్శనమని, ఈ పర్యటన పలు రంగాలలో సహకారానికి కొత్త మార్గాలను తెరుస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
A special welcome in Auckland!
The iconic Sky Tower was illuminated to mark the visit of PM @narendramodi to New Zealand, symbolizing the friendship between our two countries.
🇮🇳 🇳🇿 pic.twitter.com/46cnf1xADu
— Randhir Jaiswal (@MEAIndia) July 10, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..