ఫ్లోరిడా లోని శివారు ‘పెంబ్రోక్ పైన్స్’ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ఓ కారు పైకి సింగిల్ ఇంజన్ తో కూడిన చిన్న విమానమొకటి కిందకు నేరుగా దూసుకువచ్చి దాన్ని ఢీ కొంది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ఇద్దరు వ్యక్తులు మరణించగా..కారు లోని ఓ మహిళ, చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతానికి దగ్గరలోని ఓ వ్యక్తి ఇంటి డోర్ కి గల రింగ్ కెమెరా ఈ యాక్సిడెంట్ దృశ్యాన్ని క్యాప్చర్ చేసింది. ఈ ఘటనలో క్రాష్ జరిగిన ప్రాంతమంతా ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. విమానం, కారు రెండూ తుక్కుతుక్కు కాగా శిథిలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడిన మహిళను, చిన్నారిని వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. మండిపోతున్న కారులో తన తల్లి ఒడిలో ఉన్న బాలుడిని అతి కష్టం మీద రక్షించారు. దగ్గరలో ఓ బాంబు పడినట్టుగా పెద్ద శబ్దం వినిపించిందని, చూడగా రోడ్డు మార్గమంతా మంటలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియలేదు. నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు ప్రారంభించింది.
ఆకాశంలో ఎగురుతున్న విమానం హఠాత్తుగా కిందకు ఎలా దూసుకువచ్చిందో, ఎలా నేరుగా కారుపై పడిందో. అంతా ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. ఇది పైలట్ తప్పిదమా , లేక విమానంలో ఇంధనం అయిపోవడమా అన్నది తెలియడంలేదు. ఈ విధమైన ప్రమాదాలు చాలా అరుదని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి: Dr M Gurumurthy : తిరుపతి ఎంపీ బై ఎలక్షన్ కు డాక్టర్ ఎం గురుమూర్తి పేరు ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పదివేలతో ఈ వ్యాపారం ప్రారంభించండి.. నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించండి.. సింపుల్ బిజినెస్..