Local Train Derails: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. 17 మంది మృతి, 50 మందికి గాయాలు.. ఎక్కడంటే..

ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా 50 మందికిపైగా గాయపడ్డారు. 350 మంది ప్రయాణికులతో వెళ్తున్నప్పుడు రైలు పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే అధికారులు, పోలీసులు..

Local Train Derails: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. 17 మంది మృతి, 50 మందికి గాయాలు.. ఎక్కడంటే..
Iran

Updated on: Jun 08, 2022 | 4:05 PM

ఇరాన్‌లోని ఘోరప్రమాదం జరిగింది. తబాస్ సమీపంలో బుధవారం ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా 50 మందికిపైగా గాయపడ్డారు. టెహ్రాన్‌కు ఆగ్నేయంలో 550 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. 350 మంది ప్రయాణికులతో వెళ్తున్నప్పుడు రైలు పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇరాన్‌లోని తబాస్‌ సమీపంలో తెల్లవారుజామున రైలులోని ఏడు కోచ్‌లలో నాలుగు పట్టాలు తప్పాయి. తబాస్ నగరంలోని ఎడారి ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిందనే సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హుటాహుటినా ఘటనా స్థలానికి అంబులెన్స్, వైద్యసిబ్బంది, సహాయక బృందాన్ని తరలించారు. మూడు హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం మారుమూల ప్రాంతంలో ఉండడం వల్ల కమ్యూనికేషన్‌లో కాస్త ఆలస్యం అయినట్టుగా అధికారులు తెలిపారు. ఇకపోతే, టబాస్ నగరానికి 50 కి.మీ, రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 550 కి.మీ దూరంలో ఉండగా రైలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ రైల్వే ట్రాక్ యాజ్డ్ సెంట్రల్ సిటీని నగరంతో కలుపుతుంది. కాగా, జరిగిన ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

గతంలో 2016లో ఇరాన్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఇందులో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఇరాన్‌లో ఏటా 17,000 హైవే మరణాలు సంభవిస్తున్నాయి. అందుకే ఇక్కడి రవాణా వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైనదిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ట్రాఫిక్ చట్టాలను గౌరవించని, సేఫ్టీ చర్యలు ఏ మాత్రం పాటించని వాహనాలు, సరిపడని అత్యవసర సేవలు ఇక్కడ ట్రాఫిక్ ప్రమాదాలు, పెద్ద ఎత్తున మరణాలకు కారణంగా తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us