పాక్ జర్నలిస్ట్‌పై కేసు వేసిన ఇమ్రాన్ ఖాన్..?

పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్ట్, టీవీ యాంకర్‌పై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరువు నష్టం దావా వేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేశారని ఆరోపిస్తూ కేసు ఫైల్ చేశారు. జర్నలిస్ట్ నజామ్ సైథీపై.. ఇమ్రాన్ ఖాన్ దాదాపు రూ.1000 కోట్ల దాకా పరువునష్టం కేసు వేశారు. ఈ మేరకు.. ప్రధాని తరపు న్యాయవాది బాబర్ అవాన్‌.. జర్నలిస్ట్ నజామ్ సైథీకి కోర్టు నోటీసులు పంపారు. కాగా.. దీనిపై పాకిస్తాన్ ప్రజా […]

పాక్ జర్నలిస్ట్‌పై కేసు వేసిన ఇమ్రాన్ ఖాన్..?
Follow us

| Edited By:

Updated on: Aug 05, 2019 | 10:12 AM

పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్ట్, టీవీ యాంకర్‌పై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరువు నష్టం దావా వేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేశారని ఆరోపిస్తూ కేసు ఫైల్ చేశారు. జర్నలిస్ట్ నజామ్ సైథీపై.. ఇమ్రాన్ ఖాన్ దాదాపు రూ.1000 కోట్ల దాకా పరువునష్టం కేసు వేశారు. ఈ మేరకు.. ప్రధాని తరపు న్యాయవాది బాబర్ అవాన్‌.. జర్నలిస్ట్ నజామ్ సైథీకి కోర్టు నోటీసులు పంపారు. కాగా.. దీనిపై పాకిస్తాన్ ప్రజా సంబంధాల ముఖ్య అధికారి అస్ఘర్ లెఘరి మాట్లాడుతూ.. ప్రధాని ఇమ్రాన్‌ వ్యక్తిగత జీవితం గురించి జర్నలిస్ట్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని.. నీతి నియమాలను ఉల్లంఘించి మరీ ప్రధానిపై ఆరోపించినందుకు నోటీసులు పంపారని పేర్కొన్నారు. ఎలాగైనా ప్రధాని ఇమ్రాన్‌కు వెయ్యి కోట్లు పంపించాలని లేని పక్షంలో జైలు శిక్ష అనుభవించక తప్పదని జర్నలిస్ట్ నిజామ్ సేథీని హెచ్చరించారు అస్ఘర్ లెఘరి.