Pakistan Army: కమాండోను అరెస్టు చేసినందుకు పోలీసులను చిత్ర హింసలు పెట్టిన పాక్ ఆర్మీ.. వీడియోలు వైరల్

|

Apr 12, 2024 | 11:40 AM

ఈ వీడియోల్లో పోలీసు అధికారుల శరీరాలపై రక్తపు మరకలు, చిత్రహింసలను పెట్టిన గుర్తులను కనిపిస్తున్నాయి. అంతేకాదు మరొక వీడియోలో ఒక వ్యక్తి , ఇద్దరు ఆర్మీ సిబ్బందితో కలిసి పోలీసులను క్యూలో మోకరిల్లమని బలవంతం చేస్తున్నది కనిపిస్తోంది. ఆర్మీ చేతిలో హింసకు గురవుతున్న పోలీసులను రక్షించేందుకు అధికారులు భారీ పోలీసు బలగాలను సంఘటన స్థలానికి పంపారు. అదనపు బలగాలు తమ సహోద్యోగులను రక్షించిన తరువాత, పోలీసు స్టేషన్ పై దాడి చేసిన SSG కమాండో, అతని తండ్రి అన్వర్ జాట్, అతని సోదరులు, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

Pakistan Army: కమాండోను అరెస్టు చేసినందుకు పోలీసులను చిత్ర హింసలు పెట్టిన పాక్ ఆర్మీ..  వీడియోలు వైరల్
Pakistan Army Videos Viral
Follow us on

మన దాయాది దేశం పాకిస్తాన్ లో నిరంతరం ఎక్కడోచోట ఏదొక వివాస్పద గొడవ జరుగుతూనే ఉంది. ఈ నెల 8వ తేదీన పంజాబ్‌లోని బహవల్‌నగర్ జిల్లాలో ఓ సైనికుడి కుటుంబ సభ్యుడి నుంచి పోలీసులు అక్రమ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివాదంలో పాకిస్తాన్ సైన్యం ఏకంగా పోలీసు స్టేషన్‌పై దాడి చేసి పోలీసులను కొట్టింది. ఈ ఘటన రెండు రోజుల క్రితం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి.బహవల్‌నగర్‌లో ఆర్మీ యూనిఫాంలో ఉన్న వ్యక్తులు పోలీసులను కొట్టినట్లు చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు ఈ వీడియోల్లో పోలీసు అధికారుల శరీరాలపై రక్తపు మరకలు, చిత్రహింసలను పెట్టిన గుర్తులను కనిపిస్తున్నాయి. అంతేకాదు మరొక వీడియోలో ఒక వ్యక్తి , ఇద్దరు ఆర్మీ సిబ్బందితో కలిసి పోలీసులను క్యూలో మోకరిల్లమని బలవంతం చేస్తున్నది కనిపిస్తోంది. ఒక పోలీసు ముక్కు నుంచి నెత్తురు కారుతుండగా నేల మీద కూర్చున్నట్లు ఒక వీడియోలో కనిపిస్తోంది.

ఆర్మీ చేతిలో హింసకు గురవుతున్న పోలీసులను రక్షించేందుకు అధికారులు భారీ పోలీసు బలగాలను సంఘటన స్థలానికి పంపారు. అదనపు బలగాలు తమ సహోద్యోగులను రక్షించిన తరువాత, పోలీసు స్టేషన్ పై దాడి చేసిన SSG కమాండో, అతని తండ్రి అన్వర్ జాట్, అతని సోదరులు, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

ఖలీల్ అనే ఆర్మీ SSG (స్పెషల్ సర్వీస్ గ్రూప్) కమాండో కుటుంబ ఇంటిపై ఏప్రిల్ 8న పలువురు పోలీసు అధికారులు దాడి చేసి సైనికుడిని, అతని బంధువులు పోలీసులను బందీలుగా పట్టుకున్నారని సోర్సెస్ తెలిపింది. పోలీస్ కస్టడీలో ఉన్న సైనికుడు, అతని బంధువులను పోలీసులు హింసించారు. అంతేకాదు  పోలీసు రిమాండ్ కోరుతూ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు కూడా.. ఈ విషయంపై సైనికుడి కుటుంబ సభ్యులు స్పందిస్తూ ఖలీల్, అతని తండ్రి , సోదరులు సహా ఇతర కుటుంబ సభ్యులను “చట్టవిరుద్ధంగా  కస్టడీలో ఉంచినందుకు సంబంధిత సైనిక అధికారులు జోక్యం చేసుకుని పలువురు పోలీసు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వర్గాలు తెలిపాయి.

అంతకుముందు సైనికుడు, అతని కుటుంబం ఖైదు చేయబడిన పోలీసు స్టేషన్‌కు సైనికులు ఏడెనిమిది వాహనాల్లో వచ్చారు. స్టేషన్‌లోకి చొరబడి రైఫిల్స్, కర్రలతో పోలీసులపై దాడి చేశారు. స్టేషన్ ఇన్‌చార్జి, అతని సిబ్బందిని కనికరం లేకుండా కొట్టారు.

డిప్యూటీ కమిషనర్ జుల్ఫికర్ అహ్మద్ భూన్, జిల్లా పోలీసు చీఫ్ నసీబుల్లాఖాన్, ఆర్మీ అధికారులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో విషయం సద్దుమణిగింది. అయితే పోలీసు స్టేషన్‌లో సైనికుల ప్రవర్తనను సోషల్ మీడియా బ్లాగర్లు అప్పటికే రికార్డ్ చేశారు.

ఈ ఫుటేజీపై జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిఐ నాయకుడు హమ్మద్ అజార్ మాట్లాడుతూ పంజాబ్ పోలీసు చీఫ్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రాంతీయ ప్రభుత్వం ఈ విషయాన్ని “చిన్నదిగా పరిగణిస్తోందని పేర్కొన్నారు.

ఈ ఎపిసోడ్‌  “పాకిస్తాన్ సైన్యం, పంజాబ్ పోలీసుల మధ్య పోరాటం జరుగుతోందనేదానికి సాక్ష్యం అని ఈ ఆరోపణలు నిజమే అని ధృవీకరిస్తూ ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయని చెబుతున్నారు. దీంతో పోలీసు అధికారులు, ఆర్మీ సంస్థలు సంయుక్త దర్యాప్తు ప్రారంభించాయి. రెండు సంస్థల అధికారులు వాస్తవాలను సమీక్షించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించారు, ”అని పోలీసులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..