బిగ్ బ్రేకింగ్‌: క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 50 మంది మృతి!

|

Mar 16, 2025 | 2:34 PM

ఉత్తర మాసిడోనియాలోని కోకాని క్లబ్ పల్స్‌లో సంభవించిన భీకర అగ్నిప్రమాదంలో 50 మంది మరణించగా, 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో గందరగోళం చెలరేగి, తొక్కిసలాటలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

బిగ్ బ్రేకింగ్‌: క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 50 మంది మృతి!
Nightclub Fire In North Mac
Follow us on

ఉత్తర మాసిడోనియాలోని కోకాని క్లబ్ పల్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 50 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో.. ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో క్లబ్‌లో ఉన్న వారు ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీస్తుండగా గందరగోళం నెలకొందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు, ఈ తొక్కిసలాటలో అనేక మంది బాధితులు నలిగిపోయారని తెలుస్తోంది. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.