Kim Jong Un: అమెరికాను అలా దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్న కిమ్.. ప్లాన్ ఏంటంటే..

|

Mar 29, 2022 | 6:43 AM

Kim Jong Un: ఆయుధ సంపత్తిని పెంచుకోవడంలో తగ్గేదే లేదని ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్‌ మరోసారి తేల్చి చెప్పారు. అగ్రరాజ్యాల ఆధిపత్యం నుంచి రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళతానని అన్నారు.

Kim Jong Un: అమెరికాను అలా దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్న కిమ్.. ప్లాన్ ఏంటంటే..
Kim Jong Un
Follow us on

Kim Jong Un: ఆయుధ సంపత్తిని పెంచుకోవడంలో తగ్గేదే లేదని ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్‌ మరోసారి తేల్చి చెప్పారు. అగ్రరాజ్యాల ఆధిపత్యం నుంచి రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళతానని అన్నారు. ఇందులో భాగంగా.. అఖండ సైనిక శక్తిసామర్థ్యాలు(Military Power) ఉన్నప్పుడే యుద్ధాన్ని నిరోధించగలమని ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల సామ్రాజ్యవాదుల బెదిరింపులను సమర్ధవంతంగా తిప్పికొట్టగాలమంటూ సంచలన కామెంట్స్ చేశారు. సుమారు నాలుగేళ్ల తరువాత బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాన్ని తిరిగి ప్రారంభించిన కిమ్.. అమెరికాకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. త్వరలోనే అణ్వస్త్ర పరీక్ష కూడా ఉత్తరకొరియా నిర్వహించే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. కొత్త ఏడాది ప్రారంభమైననాటి నుంటి ఇప్పటి వరకు కేవలం మూడు నెలల కాలంలోనే కిమ్ 12 సార్లు పరీక్షలు నిర్వహించి అగ్ర దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

సుదూర లక్ష్యాలను ఛేదించే హ్వాసాంగ్-17 క్షిపణిని గత శుక్రవారం ఉత్తర కొరియా ప్రయోగించింది. ఇది అమెరికా ప్రధాన భూభాగాన్ని టార్గెట్ చేసుకునే సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు అంటున్నారు. దీనికి మించిన శక్తివంతమైన మరిన్ని క్షిపణులను రానున్న కాలంలో తాము తయారుచేయనున్నట్లు కిమ్ అన్నారు. అణు నిరాయుధీకరణపై 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కిమ్‌ చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. మరోసారి ఎలాంటి షరతులు లేకుండా ఉత్తర కొరియా చర్చలకు రావాలని బైడెన్‌ యంత్రాంగం ఆహ్వానించింది. అయితే.. ముందుగా తమ దేశంపై శత్రుత్వాన్ని వీడాలని ఈ సందర్భంగా అమెరికాకు ఉత్తర కొరియా స్పష్టం చేసింది. మరోవైపు ఆయుధాలను పెంచుకుని అమెరికాపై ఒత్తిడి పెంచాలని ఉత్తర కొరియా భావిస్తోంది. ఆయుధ సంపత్తిని విస్తరించేందుకు చర్యలు చేపట్టిన కిమ్ త్వరలో మరో ఖండాంతర క్షిపణిని ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

Elon Musk: మళ్లీ కరోనా బారినపడిన టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌

Russia Ukraine War: వార్ ఎఫెక్ట్.. సంచలన నిర్ణయం తీసుకున్న బీర్ కంపెనీలు..