Kim Jong-un: రెచ్చిపోతున్న కిమ్‌.. వరుసగా క్షిపణి ప్రయోగాలు.. దాడి తప్పదంటూ వార్నింగ్..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మళ్లీ చెలరేగుతున్నారు. దక్షిణకొరియాపై అణ్వాయుధాలను ఎక్కుపెట్టాడు కిమ్‌. తాజాగా చేసిన క్షిపణి పరీక్షలు..

Kim Jong-un: రెచ్చిపోతున్న కిమ్‌.. వరుసగా క్షిపణి ప్రయోగాలు.. దాడి తప్పదంటూ వార్నింగ్..
Kim Jong Un

Updated on: Oct 11, 2022 | 2:13 PM

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మళ్లీ చెలరేగుతున్నారు. దక్షిణకొరియాపై అణ్వాయుధాలను ఎక్కుపెట్టాడు కిమ్‌. తాజాగా చేసిన క్షిపణి పరీక్షలు ఇందుకోసమే అని ఉత్తరకొరియా ప్రకటించింది. అణ్వాయుధులాలను మోసుకెళ్లే సామర్ధ్యం ఉన్న మిస్సైల్స్‌ను కిమ్‌ పర్యవేక్షణలో ఉత్తరకొరియా సైన్యం ప్రయోగించింది. తమను రెచ్చగొడితే తప్పకుండా దక్షిణ కొరియాపై అణ్వాయుధాలను ప్రయోగిస్తామని కిమ్‌ హెచ్చరించారు.

దక్షిణ కొరియా లోని పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌లు, సైనిక స్థావరాను టార్గెట్‌ చేస్తూ ఉత్తరకొరియా అణ్వాయుధాలను మొహరించినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ ఆంక్షలను పట్టించుకోకుండా ఉత్తరకొరియా క్షిపణులను ప్రయోగిస్తోంది. రెండు వారాల్లో ఐదు క్షిపణులను ప్రయోగించింది ఉత్తరకొరియా.

ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఉత్తర కొరియా చర్యలకు రష్యా, చైనా నుంచి లభిస్తున్న రక్షణ సహకారమే కారణమని అమెరికా ఈ సమావేశంలో ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us