Dawood Ibrahim’s Photo: కొంపముంచిన దావూద్ ఇబ్రహీం ఫోటో.. ఇలా జరుగుతుందని అసలు ఊహించి ఉండడు..!

| Edited By: Ravi Kiran

Oct 26, 2024 | 9:34 PM

దావూద్ ఇబ్రహీం ఫోటో ఓ వ్యక్తి కొంపముంచింది. సోషల్ మీడియాలో డీపీగా దావూద్ ఇబ్రహీం ఫోటోను ఓ వ్యక్తి పెట్టుకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఏక్కడ జరిగింది? చివరికి ఏం అయింది?

Dawood Ibrahims Photo: కొంపముంచిన దావూద్ ఇబ్రహీం ఫోటో.. ఇలా జరుగుతుందని అసలు ఊహించి ఉండడు..!
Dawood Ibrahim
Follow us on

మాఫియా దావూద్ ఇబ్రహీం ఫోటోను తన ట్విటర్‌లో అప్‌లోడ్ చేసినందుకు ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీలోని నోయిడాలో సెక్టార్-9లో నివాసముంటున్న జునైద్ అలియాస్ రెహాన్ తన X ఖాతాలో ఇబ్రహీం ఫోటో పెట్టుకున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అతని కేసు నమోదు చేశాడు. నిందితుడు జునైద్‌పై సెక్షన్ 196 (1) (బి) కింద కేసు నమోదు చేయబడింది.

డీ-కంపెనీ అని ఒక్కటి స్థాపించిన దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ నేరస్థుల సంబంధాలను కొనసాగించాడు. , ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో సహా అనేక నేర కార్యకలాపాల్లో దావూద్ ఇబ్రహీం హస్తం ఉంది. 1993 ముంబై బాంబు పేలుళ్ల తర్వాత 250 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. మెమన్ సోదరులు, ముఖ్యంగా ఇబ్రహీం అలియాస్ టైగర్ మెమన్, బాంబేలోని దావూద్ సహచరులు పేలుళ్లకు కీలక కో-ఆర్డినేటర్లుగా ఉన్నారు.

జనవరి 1993 నాటి బొంబాయి అల్లర్లకు ‘పగతీర్చుకునేందుకు’ దావూద్‌కు తమ ప్రణాళికను అమలు చేయడంలో సహాయం చేసినందుకు పాకిస్తానీ ఏజెన్సీ ISI అతనికి క్విడ్ ప్రోకో ఒప్పందాన్ని అందించాయి సురక్షితమైన నౌకాశ్రయాన్ని కూడా అందజేస్తామని దావూద్‌కు ISI హామీ ఇచ్చింది. దావూద్ ఇబ్రహీం, అతని సోదరులు సన్నిహితులు ఇప్పటికీ రాజ్యమేలుతున్నారు. ముంబైలో దోపిడీలు, హత్యలు, సహచరులతో లావాదేవీలు వంటి అన్ని కార్యకలాపాలను ప్రస్తుతం అతనికి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న చోటా షకీల్ నిర్వహిస్తున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి. ఇటీవలే అతని సోదరుడు అనీస్ ఇబ్రహీంను పోలీసులు అరెస్టు చేశారు.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి