న్యూజిలాండ్ పీఎం సంచలన నిర్ణయం.. రైఫిళ్ల విక్రయాలపై నిషేధం

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదులో జరిగిన నరమేధం తర్వాత న్యూజిలాండ్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది. అసాల్ట్ రైఫిల్స్, సెమీ ఆటోమెటిక్ రైఫిళ్ల విక్రయాలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ ప్రకటించారు. నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో న్యూజిలాండ్‌లో ఉగ్రవాద చర్యలను దాదాపు పూర్తిగా అడ్డుకున్నట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా న్యూజిలాండ్‌లో లైసెన్స్‌డ్ ఆయుధాలు కలిగివుండటం సాధారణ విషయం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది వాటిని ఇకపై […]

న్యూజిలాండ్ పీఎం సంచలన నిర్ణయం.. రైఫిళ్ల విక్రయాలపై నిషేధం

Edited By:

Updated on: Mar 21, 2019 | 10:56 AM

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదులో జరిగిన నరమేధం తర్వాత న్యూజిలాండ్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది. అసాల్ట్ రైఫిల్స్, సెమీ ఆటోమెటిక్ రైఫిళ్ల విక్రయాలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ ప్రకటించారు. నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో న్యూజిలాండ్‌లో ఉగ్రవాద చర్యలను దాదాపు పూర్తిగా అడ్డుకున్నట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా న్యూజిలాండ్‌లో లైసెన్స్‌డ్ ఆయుధాలు కలిగివుండటం సాధారణ విషయం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది వాటిని ఇకపై ఉపయోగించడానికి వీల్లేదు. అందువల్ల ఆయుధాల్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తే, మనీ ఇచ్చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం బైబ్యాక్ స్కీంను కూడా తీసుకొచ్చింది. గతవారం క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదుల్లో ఓ దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటన జరిగిన వారం తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.