శాంతి ఒప్పందం పక్కనబెట్టి మళ్లీ అణుబాంబు వేటలో ఇరాన్? రహస్య ప్రాంతాల్లో మళ్లీ నిర్మాణ పనులు!

అమెరికా, ఇరాన్‌ల మధ్య అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన కోసం గత నెలలోనే ఒక మైలురాయి లాంటి 14-అంశాల అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ.. ఇరాన్ తన పాత బుద్ధిని మార్చుకోలేదని తాజా ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

శాంతి ఒప్పందం పక్కనబెట్టి మళ్లీ అణుబాంబు వేటలో ఇరాన్? రహస్య ప్రాంతాల్లో మళ్లీ నిర్మాణ పనులు!
Iran Nuclear New Satellite Images

Updated on: Jul 11, 2026 | 2:01 PM

అమెరికా, ఇరాన్‌ల మధ్య అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన కోసం గత నెలలోనే ఒక మైలురాయి లాంటి 14-అంశాల అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ.. ఇరాన్ తన పాత బుద్ధిని మార్చుకోలేదని తాజా ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ తన అనుమానిత రహస్య అణు కేంద్రాలలో కొన్నింటిలో నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తోందని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘CNN’ తన పరిశోధనాత్మక నివేదికలో సంచలన నిజాలను బయటపెట్టింది. అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని హామీ ఇచ్చిన తరుణంలోనే ఈ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో అమెరికా-ఇరాన్ ఒప్పందం ఉల్లంఘనకు గురైందనే భయాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.

పర్చీన్ కేంద్రంలో పనులు.. పికాక్స్ పర్వతంపై నిఘా

ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సహకారంతో సీఎన్‌ఎన్ విశ్లేషించిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. గతంలో అణ్వాయుధాలతో పేలుడు పరీక్షలు జరిగినట్లు గట్టిగా అనుమానిస్తున్న ‘పర్చీన్’ అణు కేంద్రంలో అత్యధిక కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సమాచారం. గతంలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో ఈ సముదాయం తీవ్రంగా దెబ్బతింది. అయితే, దాడులకు ముందే ఇరాన్ నిర్మించుకున్న కాంక్రీట్ రక్షణ పొర ఆధారంగా.. జూన్ – జూలై నెలల నాటి కొత్త ఉపగ్రహ చిత్రాలలో అక్కడ మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్లు స్పష్టమైంది. దీంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమానికి అత్యంత సున్నితమైన ప్రదేశంగా పరిగణించబడే ‘పికాక్స్ పర్వతం’ పరిధిలోని భూగర్భ సొరంగాలలో భారీ వాహనాల కదలికలు కనిపించాయి. ఈ పరిణామాలు అమెరికాతో కుదిరిన ఒప్పంద నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కీలక స్థావరాల వద్ద క్షిపణి పనులు

నివేదిక ప్రకారం.. ఇస్ఫహాన్, ఫోర్డో, నతాంజ్ వంటి ప్రధాన అణు ఉత్పత్తి కేంద్రాలలో ఎలాంటి కొత్త మార్పులు కనిపించనప్పటికీ, ఇరాన్‌కు చెందిన కొన్ని కీలక క్షిపణి నిల్వ కేంద్రాలలో మాత్రం మరమ్మతులు, విస్తరణ పనులు ప్రారంభమైనట్లు సంకేతాలు లభించాయి. ఇరాన్ క్షిపణి సంపత్తిపై ఇప్పటికే అమెరికా దాని మిత్రదేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ నివేదిక రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉప్పు నిప్పుగా మారిన బంధం

గత నెలలో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం.. తాము ఎలాంటి అణ్వాయుధాలను సేకరించబోమని ఇరాన్ పునరుద్ఘాటించింది. అంతేకాకుండా, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) పర్యవేక్షణలో తన వద్ద ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను పరిష్కరించుకోవడానికి అంగీకరించింది. కానీ, ఒప్పందంపై సంతకం చేసిన కొద్ది రోజులకే ఇరాన్ తెరవెనుక అణు పనులను ముమ్మరం చేయడం గమనార్హం. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కాల్పుల విరమణ ముగిసిందని, ఇరాన్‌పై కఠిన చర్యలు ఉంటాయని ప్రకటించడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us