పాప నోట తొలి మాటగా ఆ పేరు…

పసిపాప నోటి నుంచి తొలిసారి అమ్మ అనే మాట వినిపించగానే ఆ తల్లి మనసు పులకరిస్తుంది. బిడ్డ తనను అమ్మ అని ఎప్పుడెప్పుడు పిలుస్తుందా అని ఎదురు చూస్తున్న ఓ మాతృమూర్తికి 11 నెలల పాప షాకిచ్చింది. టెక్నాలజీ పుణ్యమా అని ఆ మోడ్రన్ బేబీ నోటి నుంచి వెలువడిన తొలి మాట ‘అలెక్సా’. అదేనండి.. అలెక్సా అని పిలిచి మనం ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పే అమెజాన్ వాయిస్ యాక్టివేటెడ్ గ్యాడ్జెట్ అలెక్సా. ఆశ్చర్యకరంగా […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:04 pm, Wed, 8 May 19
పాప నోట తొలి మాటగా ఆ పేరు...

పసిపాప నోటి నుంచి తొలిసారి అమ్మ అనే మాట వినిపించగానే ఆ తల్లి మనసు పులకరిస్తుంది. బిడ్డ తనను అమ్మ అని ఎప్పుడెప్పుడు పిలుస్తుందా అని ఎదురు చూస్తున్న ఓ మాతృమూర్తికి 11 నెలల పాప షాకిచ్చింది. టెక్నాలజీ పుణ్యమా అని ఆ మోడ్రన్ బేబీ నోటి నుంచి వెలువడిన తొలి మాట ‘అలెక్సా’. అదేనండి.. అలెక్సా అని పిలిచి మనం ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పే అమెజాన్ వాయిస్ యాక్టివేటెడ్ గ్యాడ్జెట్ అలెక్సా.

ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. యూకేకు చెందిన 11 నెలల అన్నాబెల్లే అనే పాప ఒకటి కాదు రెండు కాదు పదులసార్లు అలెక్సా అంటూ పిలిచింది. పాప నోట ‘అలెక్సా’ అనే మాట రాగానే తల్లిదండ్రులు షాకయ్యారట. కారణం… ఆ పాపకు మూడేళ్ల వయసున్న ఓ అన్నయ్య ఉన్నాడు. ఆ పిల్లాడు రైమ్స్ నేర్చుకోవడం కోసం అమెజాన్ అలెక్సాను కొనుక్కొచ్చారు. ఆ పిల్లాడు పదే పదే అలెక్సా అని పిలవడాన్ని నిశితంగా గమనించిన పాపాయి.. ఆ పదాన్ని గుర్తుపెట్టుకొంది. అలా ఆ చిన్నారి నోటి నుంచి వచ్చిన తొలి మాట అమ్మ బదులు అలెక్సా అయ్యింది.