Tornado: అమెరికాలో మరోసారి టోర్నడోల బీభత్సం.. మిన్నెసోటాలో కనిపించిన భయానక దృశ్యాలు!

అమెరికాలో మరోసారి టోర్నడోలు, తుఫానులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. దేశంలోని దక్షిణ మిన్నెసోటా రాష్ట్రంలో గత రెండ్రోజుల నుంచి తుఫానుల, టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో వేలాది ఇళ్లు, వ్యాపారాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పాటు తీవ్రమైన సుడిగాలులు స్థానికంగా తీవ్ర నష్టాన్ని కలిగించాయి.

Tornado: అమెరికాలో మరోసారి టోర్నడోల బీభత్సం.. మిన్నెసోటాలో కనిపించిన భయానక దృశ్యాలు!
Minnesota Tornado

Updated on: Jun 29, 2025 | 6:59 PM

అమెరికాలో మరోసారి తుఫానులు, టోర్నడోలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. దేశంలోని దక్షిణ మిన్నెసోటాలోని విక్టోరియాకు సమీపంలో తెల్లవారుజామున 12:30 గంటలకు టోర్నడోలు సంభవించినట్టు నేషనల్ వెదర్ సర్వీస్ వెల్లడించింది. ఈ టోర్నడోల కారణంగా రోలింగ్ ఏకర్స్ రోడ్, మిన్నెవాష్ట పార్క్‌వే సమీపంలో హైవేపై చెట్లు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. దీని కారణంగా రాత్రంతా రహదారి మూసివేసినట్టు పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రంలో ఉన్న హైడ్స్ సరస్సు సమీపంలో నేలపై టోర్నడోను గుర్తించినట్టు ఓ వాతావరణ నిపుణుడు తెలిపాడు.

ఈ టోర్నడోల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రజలు కూడా ఎవరూ గాయపడలేదని ఆయన తెలిపారు. ట్విన్ సిటీస్ మెట్రో ప్రాంతంలో రాత్రంతా బీభత్సం సృష్టించిన ఈ టోర్నడోలు తెల్లవారుజామున 2 గంటలకు తగ్గుముఖం పట్టాయని తెలిపాడు. వివిధ ప్రదేశాలలో ఈ టోర్నడోలకు సంబంధించిన అనేక భయానక వీడియోలు కూడా బయటకొచ్చాయని తెలిపాడు.

ఈ తుఫానులు తూర్పు దక్షిణ డకోటా, పశ్చిమ మిన్నెసోటా అంతటా వ్యాపించినట్టు కొన్ని నివేదికలు తెలిపాయి, వీటిలో కాన్బీ, మారియట్టా, డాన్వర్స్ సమీపంలో సుడిగాలుల బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు కూడా ప్రచురింపబడ్డాయి. తీవ్రమైన సుడిగాలల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 50,000 వరకు ఇళ్లు, వ్యాపార సముధాయాల్లో విద్యుత్‌ అంతరాయ సమస్యలు తలెత్తినట్టు పర్కొన్నాయి.

మరోవైపు తుఫాన్‌ ప్రభావంతో బఫెలో, రాక్‌ఫోర్డ్‌ ప్రాంతాల్లో అర్థరాత్రి కుండపోత వర్షాలు కురిసినట్టు కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ భారీ వర్షం కారణంగా స్థానిక కాలనీల్లో వరలు కూడా సంభవించినట్టు తెలుస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంలో రాబోయే రోజుల్లోనూ వర్షాలు, వరదలు పెరుగొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..