
రెండు నెలల క్రితం నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదలు ఘటన మరువక ముందే తాజాగా గురువారం టిబెట్‌ను రెండు భూకంపాలు వణికించాయి. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం ప్రకారం గంట వ్యవధిలోనే ఈ రెండు భూకంపాలు సంభించాయి. రాత్రి 8.03 గంటలకు , అరుణాచల్ ప్రదేశ్‌లోని పాండిన్‌కు సుమారు 489 కిలోమీటర్ల ఉత్తర-వాయువ్య దిశలో టిబెట్‌లో 7.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం సముద్ర మట్టానికి 173 కిలోమీటర్ల లోతులో సంభవించిందని NCS తెలిపింది.
అయితే అది సంభించిన కాసేపటికే రాత్రి సుమారు 8.42 గంటలకు, అరుణాచల్ ప్రదేశ్‌లోని బసర్‌కు ఉత్తర-వాయువ్యంగా 323 కిలోమీటర్ల దూరంలో 5.0 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సముద్ర మట్టానికి 15 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు NCS డేటా వెల్లడించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనణు రాలేదు.
పోస్ట్ చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.