95 ఏళ్ల వయస్సులో ఎవరైనా చేస్తారు..భజనలు, కీర్తనలు, పూజలు చేసుకుంటూ.. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. మరీ ఇంకేం చేస్తారు? కానీ, ఇక్కడ 95 ఏళ్ల ఓ వృద్ధుడు తన 84 ఏళ్ల స్నేహితురాలిని పెళ్లాడాడు. మే 19న, ఈ జంట 23 సంవత్సరాల క్రితం కలుసుకున్న అదే చర్చిలో వివాహం చేసుకున్నారు. 40 మంది అతిథుల సమక్షంలో, వృద్ధ జంట ఒకరికొకరు రింగ్ మార్చుకున్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ప్రేమించుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి ఏదైనా గరిష్ట వయోపరిమితి ఉందా.? అంటే ఖచ్చితమైన సమధానం లేదు..కానీ, ప్రేమ, పెళ్లి అనే ఈ రెండు సంప్రదాయాల ప్రకారం వెళ్లడం, సామాజిక నిబంధనలకు అనుగుణంగానే జరుగుతుంటాయి. అయితే, ఇక్కడ ఓ 95ఏళ్ల వృద్ధుడు తన కలల రాకుమారిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. సమాచారం ప్రకారం, 95ఏళ్ల జూలియన్ మోయిల్, వివాహం చేసుకోలేదు, ఎందుకంటే అతను ఏ అమ్మాయితోనూ ప్రేమలో పడినట్లు అతను ఎప్పుడూ భావించలేదట. వయసుతో పాటు ప్రేమ కోసం అన్వేషణ కూడా పెరిగింది. ఇంతలో, సుమారు 23 సంవత్సరాల క్రితం, జూలియన్ చర్చిలో వార్రీ విలియమ్స్‌ను కలిశాడు. ఇద్దరి మధ్య స్నేహం ఉంది.. కానీ అప్పటికీ వారిలో ప్రేమ కలగలేదు… ఇటీవల, ఫిబ్రవరిలో జరిగిన ఒక సమావేశంలో జూలియన్నే మోయిల్ వాలెరీ విలియమ్స్‌కు ప్రపోజ్ చేశాడు. మే 19న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. మరింత ఆసక్తికర విషయం ఏంటంటే..వారు క లిసిన అదే చర్చిలో వారు వివాహం చేసుకున్నారు. దాదాపు 40మంది స్నేహితులు, కుటుంబ సభ్యులు కల్వరి బాప్టిస్ట్ చర్చికి హాజరయ్యారు. జూలియన్ వృత్తిరీత్యా ఒపెరా గాయకుడు. అలా కళ్యాణ మండపంలో కూడా ఒపెరా సాంగ్ పాడారు. పెళ్లి తర్వాత హనీమూన్ ప్లాన్‌లు కూడా వేసుకున్నారు . నూతన వధూవరులు జూలియన్ జన్మస్థలమైన ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.