Women Safety: ఆ దేశం, ఈ దేశం అనే తేడా ఏమీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై అరాచకాలకు అంతే లేదు. మహిళ ఒంటరిగా రోడ్డు ఎక్కితే చాలు.. కొందరు మృగాళ్లు రెచ్చిపోతారు. కళ్లలో కామంతో వారిని అదో రకంగా చూస్తుంటారు. పబ్లిక్ ప్లేసుల్లోనూ మహిళలను వేధింపులకు గురి చేస్తుంటారు. తమ చెత్త చేష్టలతో మహిళలకు ఇబ్బంది కలిగిస్తుంటారు. ఓ వైపు మహిళల భద్రత కోసం ప్రపంచ దేశాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా ఆకతాయిలు అస్సలు కంట్రోల్ అవడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆకతాయిలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేసింది. అమ్మాయిల వైపు అదే పనిగా చూస్తే జైలుశిక్ష ఖాయమని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది. లండన్ మెట్రోస్టేషన్లతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై వేధింపులకు ఎక్కువయ్యాయని ఫిర్యాదుల వస్తున్నాయి. కావాలనే కొందరు మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తునట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. అందుకే మహిళలపై వేధింపులను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిటన్ పోలీసులు నిర్ణయించారు. అందుకే మహిళ వైపు చాలాసేపు చూస్తే వెంటనే జైలుకు పంపిస్తామని సర్క్కులర్ జారీ చేశారు.
Also read:
Gold Silver Price Today: బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Rajamouli at Charminar: నైట్ బజార్‌లో సందడి చేసిన రాజమౌళి… సెల్ఫీల కోసం పోటీపడిన యువకులు