రైలెక్కిన కిమ్.. నేడు పుతిన్‌తో భేటీ

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్ రష్యా చేరుకున్నారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి రష్యాకు తొలిసారిగా ప్రత్యేక ట్రైన్‌లో కిమ్ ఆ దేశంలో అడుగుపెట్టారు. ఆయన చేరుకోగానే ఆదేశ అధికారులు తమ సంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఇవాళ సమావేశం కానున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పర్యటన నేపథ్యంలో ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బంది పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అణ్వాయుధాల విషయమై అమెరికా-ఉత్తర కొరియాల మధ్య […]

రైలెక్కిన కిమ్.. నేడు పుతిన్‌తో భేటీ

Edited By:

Updated on: Apr 25, 2019 | 6:33 PM

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్ రష్యా చేరుకున్నారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి రష్యాకు తొలిసారిగా ప్రత్యేక ట్రైన్‌లో కిమ్ ఆ దేశంలో అడుగుపెట్టారు. ఆయన చేరుకోగానే ఆదేశ అధికారులు తమ సంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఇవాళ సమావేశం కానున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పర్యటన నేపథ్యంలో ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బంది పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అణ్వాయుధాల విషయమై అమెరికా-ఉత్తర కొరియాల మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్న నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. చర్చకు వచ్చే అంశాలపై చివరి నిమిషం వరకు రహస్యంగానే ఉంచుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us