Kamala Harris: అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారీస్‌కు కరోనా పాజిటివ్.. వైట్‌హౌస్ అలర్ట్..

|

Apr 27, 2022 | 6:36 AM

Kamala Harris tests Covid-19 positive: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, నేతలను సైతం కరోనా వెంటాడుతోంది. ఈ తరుణంలో అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారీస్‌‌కు

Kamala Harris: అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారీస్‌కు కరోనా పాజిటివ్.. వైట్‌హౌస్ అలర్ట్..
Kamala Harris
Follow us on

Kamala Harris tests Covid-19 positive: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, నేతలను సైతం కరోనా వెంటాడుతోంది. ఈ తరుణంలో అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కమలా హారిస్‌కు మంగళవారం కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైట్‌హౌస్‌ (White House) ప్రకటించింది. ఈ మేరకు హారిస్ ప్రెస్ సెక్రటరీ కిర్‌స్టెన్ అలెన్ మాట్లాడుతూ.. వైస్ ప్రెసిడెంట్ ర్యాపిడ్, పిసిఆర్ పరీక్షలలో పాజిటివ్ పరీక్షించారని.. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవని ప్రకటించారు. దీంతో హారిస్ తన నివాసంలోనే ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. కమలా హారిస్ ఇంట్లో నుంచే సేవలందిస్తారని.. నెగిటివ్ వచ్చిన తర్వాత వైట్ హౌస్‌కి తిరిగి వస్తారని వెల్లడించారు.

సీడీసీ మార్గదర్శకాల ప్రకారం.. వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. వారి సలహాలు, సూచనలతో చికిత్స కొనసాగనుంది. కాగా.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా ఇటీవల పశ్చిమ తీర పర్యటన నుంచి తిరిగి వచ్చారు. ఆమెతో అధ్యక్షుడు జో బైడెన్ సహా వైట్‌హౌస్‌లోని వారెవరూ కాంటాక్ట్‌లో లేరని తెలిపారు. అయినప్పటికీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

57 ఏళ్ల కమలా హారిస్.. కోవిడ్-19 వ్యాక్సిన్‌ సైతం తీసుకున్నారు. ఇటీవల బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం నాలుగు డోసుల టీకా తీసుకున్నారు.

Also Read: Solar Eclipse: ఏప్రిల్‌ 30న తొలి సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..? నాసా శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..?

TRS Plenary: గులాబీ మయమైన హైదరాబాద్.. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ స్వాగత ఉపన్యాసం