JD Vance: భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు.. ఆమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక ప్రకటన!

భారత్‌-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. పాక్‌-భారత్‌ ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోదని ఆయన తేల్చి చెప్పారు. ఓ అంతర్జాజాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

JD Vance: భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు.. ఆమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక ప్రకటన!
Jd Vance

Updated on: May 09, 2025 | 10:45 AM

పాక్‌-భారత్‌ ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తతలు తగ్గాలనే అమెరికా కూడా కోరుకుంటోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయగలిగేది ఏదైనా ఉందంటే, ఈ దేశాలు మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రోత్సహించడం అని ఆయన అన్నారు. భారత్‌-పాక్ మధ్య యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోబోదని ఆయన అన్నారు. ఇది ప్రాథమికంగా మన వ్యవహారం కాదు, దీన్ని అదుపు చేయడంలో అమెరికా పాత్ర ఏమీ లేదు అని జేడీ వాన్స్ ఫాక్స్ న్యూస్‌తో చెప్పారు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తారా స్థాయికి చేరాయి. 26 మంది అమాయక భారతీయులను ఉగ్రవాదులు కాల్చిచంపినందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. దీంతో భారత్‌పై పాక్‌ కూడా ప్రతికార దాడులకు పాల్పడుతోంది. గురువారం భారత్‌లోని సరిహద్దు ప్రాంతాల లక్ష్యంగా పాకిస్తాన్ చేసిన దాడులను భారత్ సైన్యం తిప్పికొట్టింది. నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి పాకిస్తాన్‌ను పంపిన సుమారు 50 డ్రోన్లను భారత భద్రతా బలగాలు కూల్చివేసినట్టు వెల్లడించాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..