Pilot Less Planes: ఇటీవల ఢిల్లీలో డ్రైవర్ లెస్ మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మాదిరిగానే జపాన్ దేశం ఓ విన్నూతన ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. పైలెట్‌లెస్ ఫైటర్ ప్లేన్‌ను రూపొందించడానికి సిద్దమవుతోంది. అయితే ఈ ప్లేన్‌ను జపాన్ మిలిటరీ విభాగం దేశ రక్షణ అవసరాల నిమిత్తం తయారుచేస్తోంది.
మొత్తం మూడు దశల్లో ఈ ఫైటర్ డ్రోన్స్ లేదా విమానాలు తయారు చేసేలా ప్లాన్ అమలుచేస్తున్నారు. తొలి దశలో రిమోట్‌తో కంట్రోల్ చేసే ఫైటర్స్, రెండో దశలో ‘టీమింగ్’ ఆపరేషన్స్ అనగా ఒక ప్లేన్‌లో మనిషి ఉండి మిగతా వాటిని కంట్రోల్ చేసేలా, తుది దశలో మానవరహిత అనగా స్వతంత్రంగా పనిచేసే స్క్వాడ్రన్‌లు రూపొందించనున్నారు. యుద్ధక్షేత్రంలో శత్రువులను ఎదుర్కొనేందుకు ఈ రిమోట్ కంట్రోల్డ్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ అవసరమని, 2035 వరకు ఇది అందుబాటులోకి వచ్చేలా ప్లాన్ చేసినట్లు మిలిటరీ ఆఫీసర్లు వెల్లడించారు. రిమోట్ బేస్డ్ ఫ్లైట్ కంట్రోల్ టెక్నాలజీ కోసం రూ.176 కోట్ల 99 లక్షలు, వీటి అనుసంధానానికి ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం రూ.14 కోట్ల 15 లక్షలను జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఇన్వెస్ట్ చేస్తోంది.