Japanese Train Driver: ఆ దేశం సమయ పాలనకు పెట్టింది పేరు. కృషి పట్టుదలతో ఆ దేశ ప్రజలు తమ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలబెట్టారు. అక్కడ రైళ్లు నిర్ణీత సమయానికి ఒక నిమిషం ముందుగా స్టేషన్ కు రీచ్ అయినా ఒప్పుకోరు.. అదే విధంగా నిమిషం లేటుగా వెళ్లినా అంగీకరించరు. ఆదేశ రైల్వే వ్యవస్థ సమయపాలను తెలిపే సంఘటన మళ్ళీ ఒకటి చోటు చేసుకుంది. తమ రైలు వ్యవస్థకు రూల్స్ కు బిన్నంగా రైలు తన స్టేషన్ లో నిమిషం ఆలస్యంగా చేరింది. దీంతో ఆ ట్రైన్ డ్రైవర్ వేతనంలో 56 యెన్ లు ఫైన్ వేసింది సదరు రైల్వే సంస్థ. అయితే ఈ విషయంలో తన తప్పు లేదని.. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానంటున్నాడు సదరు రైలు డ్రైవర్. అంతేకాదు తన యజమానిపై దావా కూడా వేశాడు. ఈ ఘటన జపాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
జూన్ 2020లో ఉదయం దేశంలోని దక్షిణ భాగంలోని ఒకాయమా స్టేషన్‌కు ఖాళీ రైలును నడపాల్సి ఉంది . అయితే ఆ డ్రైవర్ ప్లాట్ ఫామ్ మీదకు రైళ్లు తీసుకుని వెళ్ళడానికి ముందు డ్రైవర్ నుంచి సిగ్నల్ కోసం ఎదురు చూశాడు. దీంతో ఒక నిమిషం ఆలస్యంగా రైలుని ప్లాట్ ఫామ్ మీదకు తీసుకుని వెళ్ళాడు. అయితే రైలు చేరాల్సిన నిర్ణీత సమయం కంటే ఒక నిమిషం ఆలస్యమైనందున రైలు కంపెనీ JR వెస్ట్ శాఖ ఆ వ్యక్తికి జరిమానా విధించింది. అతని వేతన నుంచి మన దేశ కరెన్సీలో రూ. 55 ఫైన్ వేసింది. దీంతో ఆ డ్రైవర్ తన తప్పు లేదని.. తన వలన కంపెనీకి ఎటువంటి నష్టం జరగలేదని అంటున్నాడు. అంతేకాదు తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని అంటున్నాడు. అంతేకాదు ఒకాయమా జిల్లా కోర్టును ఆశ్రయించాడు. తన తప్పు లేకుండా తన జీతాన్ని కట్ చేయడమే కాకుండా.. తనకు తీవ్ర మనస్థాపం కలిగించినందుకు 20 వేల డాలర్ల నష్టపరిహారాన్ని కోరాడు.
జపాన్‌లో రైళ్లు కచ్చితంగా సమయానికి నడుస్తాయి. ఒక నిమిషం ముందు రైళ్లు నిర్ణీత స్థలానికి చేరుకున్నా ఇబ్బందే.. ఒక్క నిమిషం ఆలస్యం అయినా ఇబ్బంది.. గతంలో 2017లో ఓ రైలు 20 సెక్లను ముందుగా వెళ్లినందుకు రైల్వేశాఖ భారీ క్షమాపణ లెటర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: షుగర్ పేషేంట్స్‌కు తీపి తినాలని ఉంటే.. వీటిని రోజు తినే ఆహారంలో తీసుకోవచ్చంటున్న నిపుణులు..