బీచ్‌లో కొట్టుకువచ్చిన వింత బంతి… ఏ క్షణానైనా పేలిపోతుందని.. భయం భయంగా..

అయితే అది ఏంటి, ఎలా బీచ్‌కు చేరింది అనే కోణంలో విచారణ సాగుతోంది. యూట్యూబ్‌లో ఈ వీడియోను లక్షల మంది చూశారు.

బీచ్‌లో కొట్టుకువచ్చిన వింత బంతి... ఏ క్షణానైనా పేలిపోతుందని.. భయం భయంగా..
Strange Ball

Updated on: Feb 25, 2023 | 10:55 AM

మన చుట్టూ ఉన్న భూమిపై అనేక వింతలు, విచిత్రాలు కనిపిస్తుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని అంతరిక్షం నుండి వచ్చినట్టుగా భావిస్తారు. కొందరు వాటిని అద్భుతంగా పిలుస్తారు. జపాన్‌లోని ఒక బీచ్‌లో కూడా అలాంటి ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కడ సముద్ర తీరంలో ఒక పెద్ద మెటల్ బాల్ ప్రత్యక్షమైంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ కనిపించిన వింత బంతిని చూసిన పర్యాటకులందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. బీచ్‌లో కనిపించిన వింత ఆకారం చూసిన అక్కడి వారంతా హడలెత్తిపోయారు.

ట్విట్టర్ @TansuYegen ఖాతాలో ఇందుకు సంబంధించిన ఒక వీడియో షేర్‌ చేయబడింది. దీనిలో ఒక భారీ మెటల్ గోళాకారపు బంతి బీచ్‌లో పడి ఉంది, దీనిని చూసి అందరూ అక్కడ్నుంచి పరుగులుపెట్టారు. భారీ ఆకారంలో ఉన్న బంతిని చూసి మరికొందరు ఆశ్చర్యపోయారు. కానీ, అసలు విషయం ఏంటన్నడి మాత్రం ఎవరికీ తెలియదు.

ఇవి కూడా చదవండి

వింత బంతి కనిపించిన బీచ్ ..ఫేమస్‌ టూరిస్ట్ ప్లేస్ కావడంతో పర్యాటకులు ఆ ప్రాంతానికి దూరంగా వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు, అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో కలిసి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ విచారణ ప్రారంభించింది. జ‌పాన్‌లోని హ‌మ‌మ‌ట్సు నగరంలోని ఎన్‌షు బీచ్‌లో జరిగింది ఈ ఘటన. మొట్టమొదట ఈ బంతిని ఒక మహిళ చూసింది. ఆమె వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దానికి చుట్టు పక్కల 200 మీటర్ల వరకు ప్రజల్ని అనుమతించకుండా నిషేధం విధించారు. ఇక ఆ వింత ఆకారాన్ని చూసిన చాలా మంది ప్రజలు అది గ్రహాంతరవాసులకు సంబంధించిన షేల్స్‌గా చెప్పుకోవటం మొదలు పెట్టారు.

వృత్తాకార లోహం పరిమాణం 1.5 మీటర్లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దీనికి రెండు వైపులా హుక్స్ కట్టబడి ఉన్నాయి. ఇదిఎంటీ అన్నది..ఎవరూ ధృవీకరించనప్పటికీ, బహుశా ఈ వృత్తాకార వస్తువు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బాంబు కావచ్చునని భయపడుతున్నారు. ఎక్స్ రేలో బంతి లోపలి నుంచి బోలుగా ఉందని తేలింది. అందుకే అది పేలుడుకు గురయ్యే అవకాశం లేదని తేలింది. అయితే అది ఏంటి, ఎలా బీచ్‌కు చేరింది అనే కోణంలో విచారణ సాగుతోంది. యూట్యూబ్‌లో ఈ వీడియోను లక్షల మంది చూశారు. దీన్ని ‘మార్నింగ్ బోయ్’ అంటూ కొందరు వినియోగదారులు కామెంట్‌ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..