వామ్మో..! ఇరాన్ న్యూక్లియర్ సెంటర్లపై దాడికి ఇజ్రాయెల్ స్కెచ్.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇజ్రాయెల్‌కు అన్ని దిక్కుల్లో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మిస్సైళ్ల దాడి తర్వాత పరిస్థితి మరింత దిగజారింది.

వామ్మో..! ఇరాన్ న్యూక్లియర్ సెంటర్లపై దాడికి ఇజ్రాయెల్ స్కెచ్.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?
Third World War

Updated on: Oct 05, 2024 | 5:55 PM

ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇజ్రాయెల్‌కు అన్ని దిక్కుల్లో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మిస్సైళ్ల దాడి తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. మరోవైపు ఇరాన్‌పై ప్రతీకారానికి ఇజ్రాయెల్‌ రెడీ అవుతోంది. హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలోకి ఇరాన్ ప్రవేశించడంతో పశ్చిమాసియా ఇప్పుడు భగ్గుమంటోంది. ఇరాన్‌ భూభాగంలో ఉన్న ఆ దేశ అణు స్థావరాలు, చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్‌ దాడులకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ చిచ్చు ప్రపంచమంతా అంటుకోబోతోందా? సమస్య మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయబోతోందా? ఓవైపు రష్యా-యుక్రెయిన్.. మరోవైపు ఇరాన్-ఇజ్రాయెల్.. ప్రపంచం యుద్ధంలోకి దిగిపోయినట్లేనా? అని ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌ మిస్సైళ్ల దాడులతో, ఇజ్రాయెల్‌ ప్రతీకారంతో రగులుతోంది. రివెంజ్‌ తీర్చుకోవడానికి ఎదురుచూస్తోంది. అయితే అవి ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అనేది టెన్షన్‌ రేపుతోంది. ఇరాన్‌లోని చమురు, సహజవాయువు క్షేత్రాలు, అణు స్థావరాలను ఇజ్రాయెల్‌ టార్గెట్‌ చేసుకోనుందని సమాచారం. ఇరాన్‌ని ఆర్థికంగా, సైనికపరంగా దెబ్బతియ్యడం లక్ష్యం. ఇరాన్‌లో ఏ ప్రాంతాలను ఇజ్రాయెల్‌ టార్గెట్‌ చేయనుందన్న ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పుట్టిస్తోంది. Israel Iran War 3 ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు అమెరికా సలహా పాటిస్తారా? లేక పశ్చిమాసియా యుద్ధ వాతావరణం సృష్టిస్తారా? నెతన్యాహు వైఖరి చూస్తే మాత్రం బైడెన్‌ మాటలు పట్టించుకునేలా లేదనిపిస్తోంది. ఇరాన్‌ న్యూక్లియర్‌ సైట్స్‌ మీద దాడులు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయిల్‌ కసిగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రతి దాడులు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి