Port Explosion: ఓడరేవులో భారీ పేలుడు.. 115 మందికి గాయాలు

Port Explosion: దక్షిణ ఇరాన్ నగరమైన బందర్ అబ్బాస్‌లోని షాహిద్ రాజయీ ఓడరేవులో శనివారం పెద్ద పేలుడు సంభవించిందని, ఈ పేలుడు తర్వాత కనీసం 115 మంది గాయపడ్డారని అక్కడి మీడియా నివేదించింది. పేలుడుకు సంబంధించి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

Port Explosion: ఓడరేవులో భారీ పేలుడు.. 115 మందికి గాయాలు

Updated on: Apr 26, 2025 | 5:13 PM

Port Explosion: దక్షిణ ఇరాన్ నగరమైన బందర్ అబ్బాస్‌లోని షాహిద్ రాజయీ ఓడరేవులో శనివారం పెద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సుమారు 115 మంది గాయపడ్డారని అక్కడి మీడియా నివేదించింది. ఒమన్‌లో ఇరాన్ అమెరికాతో మూడవ రౌండ్ అణు చర్చలు ప్రారంభించిన సమయంలో ఈ పేలుడు సంభవించింది. అయితే పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ప్రమాదానికి కారణం ఏంటి?

ఈ పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల పరిధిలో గృహాల కిటికీలు సైతం పగిలిపోయాయని, పేలుడుకు సంబంధించిన అనేక దృశ్యాలు ఆన్‌లైన్‌లో షేర్ అయ్యాయని ఇరాన్ మీడియా తెలిపింది. అలాగే పేలుడు ధాటికి ఓ భవనం కూలిపోయినట్లు ఇరాన్‌ మీడియా తెలిపింది. ఇదిలా ఉండగా.. రజేయీ ఓడరేవులో ప్రధానంగా కంటెయినర్ల కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. ఏటా 80 మిలియన్‌ టన్నుల సరకు ఎగుమతి, దిగుమతి అవుతుంది. స్థానికంగా చమురు ట్యాంకులు, పెట్రోకెమికల్ సౌకర్యాలు కూడా ఉన్నాయి.

పోర్ట్‌ కార్యకలాపాలు నిలిపివేత:

మంటలను ఆర్పడానికి పోర్టు కార్యకలాపాలను నిలిపివేసినట్లు సెమీ-అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది. అలాగే పెద్ద సంఖ్యలో పోర్టు ఉద్యోగుల గాయపడి ఉండవచ్చని, కొందరు మరణించి కూడా ఉండవచ్చని తెలిపింది. ఈ పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల పరిధిలో గృహాల కిటికీలు సైతం పగిలిపోయాయని, పేలుడుకు సంబంధించిన అనేక దృశ్యాలు ఆన్‌లైన్‌లో షేర్ అయ్యాయని ఇరాన్ మీడియా తెలిపింది.

 


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి