వైద్య చికిత్స కోసం వచ్చిన తన వద్దకు వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం అలవాటుగా చేసుకున్నాడు. వైద్యం చేస్తున్నానంటూ వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. డాక్టర్ ముసుగులో తనలోని రాక్షసుడ్ని బయటపెట్టాడు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అతని బారిన పడిన మహిళలు మొత్తం 48 మంది. 35 ఏళ్లుగా ఇదే పని. ఆఖరికి ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా.. అతనిపై హైకోర్టులో విచారణ జరగుతోంది. లండన్ లో వైద్యవృత్తి చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డ భారత సంతతికి చెందిన కృష్ణ సింగ్.. తన దగ్గర ట్రీట్ మెంట్ కోసం వచ్చే మహిళలను లైంగికంగా వేధించేవాడని పలువురు ఆరోపిస్తూ గ్లాస్గో లోని హైకోర్టులో పిటిషన్ వేశారు.1983 నుంటి 2018 మధ్య 35 ఏళ్ల వ్యవధిలో 48 మంది మహిళలపై డాక్టర్ కృష్ణసింగ్ లైంగిక నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. నార్త్ లానార్క్ షైర్‌లోని వైద్య విధానాలలో ఈ నేరాలు అధికంగా జరిగాయి. మహిళలపై నేరానికి పాల్పడడం డాక్టర్ సింగ్ కు పరిపాటిగా మారిందని ప్రాసిక్యూటర్ ఏంజెలా గ్రే.. కోర్టుకు తెలిపారు.
మభ్యపెట్టి, బెదిరించి తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేసే వారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. లైంగిక నేరం అనేది అతని ఉద్యోగ జీవితంలో భాగంగా మారిందని తీవ్రంగా వాదించారు. సింగ్‌ను సమాజంలో అందరూ గౌరవంగా చూస్తారని, దానిని అలుసుగా తీసుకుని మహిళపై లైంగిక నేరాలకు పాల్పడ్డారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సేవలకు ఆయన చేసిన కృషికి రాయల్ మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (MBE) గౌరవం పొందడం గమనార్హం.
2018 లో డాక్టర్ వద్దకు చికిత్స కోసం వెళ్లిన ఓ మహిళా రోగిని లైంగికంగా వేధించారు. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల 54 ఆరోపణలపై డాక్టర్ దోషిగా తేలాడు.కేసును విచారించిన న్యాయమూర్తి శిక్షను వచ్చే నెలకు వాయిదా వేశారు.
Also Re