దుబాయ్‌లో భారతీయుడికి భారీ జరిమానా విధించారు. దుబాయ్‌లో కారును ఢీకొట్టిన 39 ఏళ్ల భారతీయ వ్యక్తికి 25,000 దిర్హామ్‌లు (రూ. 5,56,672) జరిమానా విధించారు. ఆ వ్యక్తి దుబాయ్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు అదుపు తప్పి రోడ్డుకు కుడివైపున ఆగి ఉన్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఆగస్టు 18న బుర్ దుబాయ్‌లోని సమీప ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత్‌కు చెందిన 39 ఏళ్ల వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపాడు. ఈ క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కన పార్క్ చేసిన ఓ కారును ఢీ కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
అయితే అక్కడి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. కారు నంబర్ ప్లేట్‌ను గుర్తించిన పోలీసులు గంటల వ్యవధిలోనే అతడిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతున్నట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. బెయిల్‌పై విడుదల కావడానికి ముందు రెండు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్నాడు.
ఈ కేసులో 25,000 దిర్హామ్‌లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించిన న్యాయమూర్తి, దానిని పాటించకుంటే ఎనిమిది నెలల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందన్నారు. దుబాయ్ ట్రాఫిక్ కోర్టుకు హాజరుకాకపోవడంతో జరిమానా విధించారు. ఒక్క యూఏఈలోనే దాదాపు 14 శాతం రోడ్డు ప్రమాదాలు తాగి వాహనాలు నడిపేవారి వల్లే జరుగుతున్నాయని స్థానిక మీడియా పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి