పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేశాం… కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్

| Edited By:

Dec 05, 2020 | 7:20 AM

పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని, ఇప్పటికే భారత్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేశామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.

పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేశాం... కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్
Follow us on

పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని, ఇప్పటికే భారత్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేశామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఆయన యూనిసెఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి ఇస్పొనోజా తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ… భారత్ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోందని అన్నారు. అందులో భాగంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేసినట్లు, దానిని విజయవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఇతర విధానాలను అనుసరిస్తున్నామని వివరించారు.

ఎజెండా 2050కి అనుగుణంగా….

భారత్‌లో ప్రతీ ఒక్కరికీ పర్యావరణ పరిరక్షణ విషయమై ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నామని, ప్లాస్టిక్ బ్యాన్ ‌ను ప్రజలే స్వచ్ఛందంగా పాటిస్తున్నారని అన్నారు. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఫ్రాన్స్ తో కలిసి ముందుకెళ్తామని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విషయంలోనూ కఠినంగా ఉంటామని అన్నారు.