ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్.. మనవాళ్లు పీకిందేమి లేదు.. పాక్ మాజీ ప్రధాని సోదరి ఏమందంటే?

పహెల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సైనిక చర్యపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ ప్రశంసల జల్లు కురిపించింది. పాకిస్తాన్‌ భారత్‌పై భారత్ చేపట్టి ఆపరేషన్ సిందూరు పూర్తి స్థాయిలో విజయం సాధించది.. పాక్ ఆర్మీ తన పరాజయాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్.. మనవాళ్లు పీకిందేమి లేదు.. పాక్ మాజీ ప్రధాని సోదరి ఏమందంటే?
Noreen Niazi Pakistan Army Comments

Updated on: Jul 21, 2026 | 11:57 AM

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నొరీన్ నియాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పహెల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పూర్తి విజయవంతం అయిందని.. ఈ సైనిక చర్యలో ఓటమి చవి చూపిన పాకిస్తాన్ ఆర్మీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఓ ఫేక్ సక్సెస్ స్టోరీని అల్లుకుందని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నియాజీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన ఘర్షణల గురించి పాక్ జనరల్స్ మొత్తం అబద్దాలే చెప్పారని.. క్షేత్రస్థాయిలో జరిగింది ఒకటి అయితే.. పాక్ సైన్యం జనాలకు చెప్పింది మరొకటని ఆమె చెప్పుకొచ్చింది. వాళ్లు చెప్పిన దాడిని క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ ఆపరేషన్‌లో భారత్ పూర్తి విజయం సాధించిందని తెలిపింది.

ఇవే కాదు ఆమె మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ ఈ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఇజ్రాయెల్‌తో జరిగిన ఒక అంతర్గత అవగాహనే కారణమని నియాజీ ఆరోపించారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా శాంతియుత దేశంగా చూపిస్తూ, రహస్యంగా అబ్రహం ఒప్పందాలలోకి ఇజ్రాయెల్‌ను గుర్తించేలా తీసుకెళ్లడానికి పాక్ సైన్యం ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

అలాగే పాకిస్తాన్ సైన్యం మార్కా-యే-హక్’గా పేర్కొన్న ఈ సైనిక ఘర్షణ మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకున్నారని, పాక్ నాయకత్వానికి సురక్షితమైన నిష్క్రమణ కల్పించారని ఆమె చెప్పింది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఆమె ఎలాంటి ఆధారాలు చూపలేదు.

అయితే నొరీన్ నియాజీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ పాలకవర్గం, సైన్యం తీవ్రంగా స్పందించాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా సైనిక వ్యవస్థను, ప్రభుత్వ సంస్థలను బ్లేమ్ చేస్తూ విద్వేషపూరితమైన, అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తరిస్తున్నారనే ఆరోపణలతో నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NCCIA) ఆమెకు నోటీసులు జారీ చేసింది.

అలాగే అధికార PML-N పార్టీ నాయకులు సైతం ఆమె వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. దేశ భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసేలా ఆమె అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ.. నియాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us