Colombia: కొలంబియాలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి, 34 మందికి గాయాలు..

|

Feb 09, 2022 | 4:17 PM

Mudslide in Colombia: కొలంబియాలో గత కొన్ని రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రోజున కురిసిన భారీ వర్షం(Heavy Rains) బీభత్సం సృష్టించాయి. ఈ వర్షాల కారణంగా కొండచరియలు..

Colombia: కొలంబియాలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి, 34 మందికి గాయాలు..
Mudslide In Colombia
Follow us on

Mudslide in Colombia: కొలంబియాలో గత కొన్ని రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రోజున కురిసిన భారీ వర్షం(Heavy Rains) బీభత్సం సృష్టించాయి. ఈ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి బురద ఏర్పడింది. ఈ బురద చిక్కుకుని 14 మంది మృతి చెందారని 34 మంది గాయపడ్డారని జాతీయ విపత్తు ఏజెన్సీ తెలిపింది. పశ్చిమ కొలంబియా పట్టణంలోని నివాస ప్రాంతంలోకి భారీగా బురదనీరు చేరింది. దీంతో ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా తెల్లవారుజామున కురిసిన వర్షాలకు మధ్య-పశ్చిమ రిసరాల్డా ప్రావిన్స్‌లోని పర్వతంపై కొండచరియలు విరిగిపడ్డాయి. మునిసిపాలిటీ ఆఫ్ డోస్క్వెబ్రాదాస్‌లోని అనేక గృహాలుపై ఈ కొండ చరియలు విరిగి పడడంతో భవనాలు ధ్వసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
అంతేకాదు ఈ ప్రాంతం ఇంకా ప్రమాదం అంచున ఉందని.. మళ్ళీ కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని కనుక ఆ ప్రాంత ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని పెరీరా మేయర్ కార్లోస్ మాయా సూచించారు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న సహాయక బృందం సహాయక చర్యలు చేపట్టింది. రెస్క్యూ టీమ్‌లు బురదలో చిక్కుకున్న వారిని తవ్వి ప్రాణాలతో బయటకు తీసుకుని రావడానికి చర్యలు చేపట్టిందని నేషనల్ యూనిట్ ఫర్ మేనేజ్‌మెంట్ ఆఫ్ రిస్క్‌ అండ్ డిజాస్టర్స్ తెలిపింది. ఈ దారుణ ఘటనపై బాధితులు స్పందిస్తూ.. మొదట చాలా పెద్ద శబ్దం వచ్చింది. దీంతో మేము చాలా భయపడ్డామని చెప్పారు. వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి పర్వతం పడుతున్న పై భాగాన్ని చూసినట్లు టాక్సీ డ్రైవర్ డుబెర్నీ హెర్నాండెజ్, 42, AFP కి చెప్పారు. మృతుల కుటుంబాలకు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Also Read:

ఒమిక్రాన్ తదుపరి వేరియంట్లు అంటువ్యాధిగా మారే అవకాశం.. WHO ఆందోళన