కాలిఫోర్నియాలో హైవేపై కూలిపోయిన హెలికాప్టర్.. భారీగా ట్రాఫిక్ జామ్‌

ఆగ్రరాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియా, సాక్రమెంటోలోని హైవే 50పై ఒక హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా హైవేపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా వెలుగులోకి రాలేదు.

కాలిఫోర్నియాలో హైవేపై కూలిపోయిన హెలికాప్టర్.. భారీగా ట్రాఫిక్ జామ్‌
Helicopter Crash In Highway 50

Updated on: Oct 07, 2025 | 3:03 PM

అమెరికా కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో మంగళవారం ఒక హైవేపై హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారని ప్రాథమిక నివేదికలు ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. హెలికాప్టర్ హైవేపై కూలిపోయిన తర్వాత హైవే 50పై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌లో హెలికాప్టర్ గాలిలో నియంత్రణ కోల్పోయి.. తిరుగుతూ హైవే దగ్గర నేలపై కూలిపోవడం కనిపిస్తుంది. ఇలా హెలికాప్టర్ కూలిపోతున్న సమయంలో రోడ్డుమీద అనేక కార్లు, వివిధ రకాల వాహనాలు ప్రయాణిస్తున్నట్లు కనిపించాయి. నివేదికల ప్రకారం పిల్లల ఆసుపత్రి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే హెలికాప్టర్ కూలిపోయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఒక ఫోటో క్రాష్ తర్వాత అక్కడ చోటు చేసుకున్న పరిణామాలను చూపిస్తుంది. చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మృతుల సంఖ్యకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా విడుదల కాలేదు. కొన్ని నివేదికల ప్రకారం అమెరికా సమయం ప్రకారం సాయంత్రం 7:10 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ హోవే అవెన్యూ సమీపంలోని హైవే 50 తూర్పు వైపున ఉన్న లేన్లలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే హైవేకి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీని వలన భారీ ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది.

ప్రమాదానికి సంబంధించిన ఫోటోల ద్వారా ఆ హెలికాప్టర్ రీచ్ ఎయిర్ మెడికల్ హెలికాప్టర్ అని తెలుస్తోంది. OC స్కానర్ ప్రకారం మంగళవారం సాయంత్రం 7 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగింది. UC డేవిస్ మెడికల్ సెంటర్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ కూలిపోయిందని సమాచారం.

సాక్రమెంటో నగర మండలి సభ్యురాలు లిసా కప్లాన్ క్రాష్ సైట్ లో ఈ ప్రమాదానికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. హైవేపై చాలా సమయం ట్రాఫిక్ జామ్‌ అయింది. ఆమె Xలో ఇలా రాసింది, “నేను ఈ రోజు రాత్రి సాక్రమెంటో షెరీఫ్ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నాను.హెలికాప్టర్ క్రాష్ అయిన ప్రదేశం నుంచి వచ్చిన మొదటి వ్యక్తులలో మేము ఉన్నాము. ఇది ఒక దిగ్భ్రాంతికరమైన దృశ్యం. గాయపడిన వారందరూ త్వరగా కోలువకోవాలని ప్రార్దిస్తున్నా అని పేర్కొంది. హైవే 50 వైపు వెళ్ళకండి.. ఆ రెండు మార్గాలను క్లోజ్ చేశారు. అని వెల్లడించింది.

అనేక మంది గాయపడ్డారని సాక్రమెంటో అగ్నిమాపక శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రమదం జరిగిన వెంటనే అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఒక రోగిని హెలికాప్టర్ ద్వారా యూనివర్శిటీ హాస్పిటల్ సౌతాంప్టన్‌లోని మేజర్ ట్రామా సెంటర్‌కు తరలించారు. బహుళ సంస్థల దగ్గర రెస్క్యూ బృందాలు మోహరించాయి. రహదారి పూర్తిగా మూసివేశారు. ప్రమాదానికి గల కారణం ఇంకా దర్యాప్తులో ఉంది

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..