Gold price in Pakistan: హలో అండీ.. పాకిస్థాన్‌లో తులం బంగారం ధర ఎంతో తెల్సా..?

పేదోడు పెద్దోడు అని తేడాలేకుండా కొనేది పసిడే. పరపతికి...సంపదకు...అత్యవసరాలకు...నిత్యావసరం బంగారమే. రూపాయి మన దేశంలోనే చెల్లుబాటు..కానీ బంగారం ఎక్కడైనా చెల్లుబాటే. ఇన్‌ఫ్లియేషన్ పెరిగిన కొద్దీ..మనల్ని ఆదుకునేది బంగారమే. మన దగ్గరే కాదు పాకిస్థాన్‌లోనూ బంగారం పైకి పరుగులు పెడుతోంది.

Gold price in Pakistan: హలో అండీ.. పాకిస్థాన్‌లో తులం బంగారం ధర ఎంతో తెల్సా..?
Gold Rate In Pakistan

Updated on: Oct 26, 2024 | 11:19 AM

26 అక్టోబర్, 2024… శనివారం రోజున పాకిస్థాన్‌లో తులం బంగారం ధర రూ. 2,85,700( పాకిస్థాన్ కరెన్సీ)గా ఉంది. మన దగ్గర రూపాయి.. పాక్థిస్థాన్‌లో 3 రూపాయల 30 పైసలుగా ఉంది. ఈ లెక్కన మన కరెన్సీలో 86575 చెల్లిస్తే అక్కడ తులం బంగారం వస్తుంది. మన దగ్గర తులం బంగారం రేటు 80 వేల మార్క్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇక పాకిస్థాన్‌లో 1 గ్రాము 24 క్యారెట్స్ బంగారం రూ.24,495 కి అమ్ముతున్నారు.  10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం రూ.2,44,950కి ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఒక తులం అంటే 11.667 గ్రాముల బంగారంతో సమానం. ఒక ఔన్స్ అనేది పాకిస్థాన్‌లో 2.43 తులాల బంగారంతో సమానం. వడ్డీ రేట్లు, ద్రవ్య విధానం, భౌగోళిక రాజకీయాలు, యుద్ద పరిస్థితలు, కరెన్సీ మార్కెట్లు, ద్రవ్యోల్బణం లేదా ప్రతి ద్రవ్యోల్బణం, పెట్టుబడి డిమాండ్, ఆభరణాల డిమాండ్, ఈక్విటీ మార్కెట్లు, జీయో పొలిటికల్ క్రైసెస్, ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా పెరగడం,  వంటికి బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. 

ప్రస్తుతం చూస్తే భారత్‌తో పాటు పాకిస్థాన్‌లో కూడా బంగారం రేటు పైకి ఎగబాకుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యం ఉద్రిక్తతలు కూడా ధరల పెరుగుదలకు కారణం. రష్యా ఉక్రెయిన్ వార్, యూఎస్ -చైనా ట్రేడ్ వార్, మిడిల్ ఈస్ట్ వార్‌..ఇలా అంతర్జాతీయంగా పెరిగిన ఉద్రిక్తతల కారణంగా బంగారం రేట్లు ఆకాశానికి అంటుతున్నాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం సురక్షితమైన ఆస్తిగా జనం చూస్తున్నారు. యూఎస్ ట్రెజరీ దిగుబడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో కామెక్స్‌లో బంగారం 0.5శాతం పెరిగి ఔన్స్‌కు 2,691.30 వద్ద ముగిసింది. బంగారం అదే ట్రెండ్‌ను కొనసాగిస్తే ప్రారంభ సెషన్‌లో 2,700.60 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. త్వరలో జరుగబోయే అమెరికా ఎన్నికలపై అనిశ్చితి, కీలక ఆర్థిక డేటా అంచనాల కారణంగా బంగారం ధరలు ఇంకా పెరగబోతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో వడ్డీరేట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే డాలర్ విలువ తగ్గుతుంది. డాలర్ విలువ తగ్గిన ప్రతిసారీ బంగారం రేటు హైరేంజ్‌లో పెరుగుతూ వస్తోంది. ఆసమయంలో డాలర్ బేస్ ఇన్వెస్టిమెంట్ తగ్గుతుంది…గోల్డ్‌కు ఇన్విస్టెమెంట్ పెరుగుతుంది.

పాకిస్థాన్‌లో బంగారం ధర – శనివారం 26 అక్టోబర్, 2024

    గోల్డ్ రేట్    24 క్యారెట్  బంగారం       24 క్యారెట్ బంగారం        21 క్యారెట్ బంగారం      18 క్యారెట్ బంగారం
    తులం బంగారం     285,700       261,891         249,987         214,275
    10 గ్రాముల బంగారం     244,950       224,537         214,331         183,712
    గ్రాము బంగారం     24,495       22,453         21,433         18,371
    ఔన్స్ బంగారం     694,251      636,396         607,469        520,688

మామూలుగా మనకు బంగారం గోల్డ్‌ బార్, గోల్డ్ కాయిన్స్, జువెలరీ రూపంలో అందుబాటులో ఉంది. ఇందులో గోల్డ్ బార్, గోల్డ్ కాయిన్స్ ప్యూర్ గోల్డ్ అంటే 99.9 స్వచ్ఛత గలవి. ఇక నగల తయారీకి 22 క్యారెట్ల స్వచ్ఛతో కూడిన బంగారాన్ని ఎక్కువగా వినియోగిస్తారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి