అమెరికాలో తెలుగువారి అతిపెద్ద వేడుక అయినటువంటి తానా (TANA) మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ వేడుకలు జూలై 7 వ తేదీన ప్రారంభం కానున్నాయి. 8 వ తేదీ,9 తేదీల్లో వైభవంగా తానా వేడుకలను నిర్వహించనున్నారు. 23వ మహాసభల సమన్వయకర్త పొట్లూరి రవి వ్యవహరిస్తున్నారు. ఈ మహాసభలకు విశిష్ట అతిధిగా ధాజీ హాజరుకానున్నారు.
మూడు రోజులు జరిగే ఈ వేడుకల్లో అమెరికా, కెనడా , ఉభయ తెలుగు రాష్టాలలో వున్న విశిష్ఠ అతిథులు హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో తెలుగు ఆడపడుచుల ఆట పాటలు, ఆత్మీయుల పలకరింపులు, అతిరథ మహారథులు, కవులు, కళాకారులతో వీనుల విందైన సంగీతం, ఆహ్లాదకరమైన కార్యక్రమాలు.. పండుగ వాతావరణంలో వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో, అంగ రంగ వైభవంగా జరగబోయే ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం నిలవనుంది.
వేడుకల్లో చివర రోజైన జూలై 9వ తేదీ ఉదయం 7 గంటలకు ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహించనున్నారు. ప్రపంచ శాంతి, మానవ జాతికి విజయం కోసం TTD అర్చకులు నిర్వహించనున్నారు.
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన॥ వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి.. “వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు.. వేంకటేశ్వరునితో సమానమైన దేవుడు లేడు” అంటూ జరగనున్న కల్యాణానికి USAలో నివసిస్తున్న ఆసక్తిగల భక్తులందరూ భారీ సంఖ్యలో హాజరు కావాలని.. ఆత్మీయులకు ఆత్మీయ సాదర స్వాగతం అంటోంది టీటీడీ. అంతేకాదు హాజరుకానున్న భక్తుల రిజిస్ట్రేషన్ కోసం దిగువ ఫారమ్‌ను పూర్తి చేయమని తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతోంది.
మరిన్ని వివరాల కోసం కింద లింక్ ను క్లిక్ చేయండి..
https://tanaconference.org/tana-ttd-srinivasa-kalyanam-details.html
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..